జేఏసీని అవమానించేలా పవన్ మాటలు!

పవన్ కల్యాణ్ లోని ఉద్యమశీలత ఇదేనా?

పవన్ కల్యాణ్ తనను తాను ఉద్యమ నాయకుడిగా గుర్తించుకోవడానికి ఇష్టపడతారు. పోరాటం ద్వారానే దేనినైనా సాధించుకోవచ్చునని ఆయన ప్రవచిస్తూ ఉంటారు. కానీ, అధికారంలోకి వచ్చేసరికి ఉద్యమ నాయకుడిగా ఆయన నమ్మిన సిద్ధాంతాలన్నీ మరచిపోయినట్టున్నారు.

కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కూటమిలో ఆయన భాగస్వామి గనుక.. కేంద్ర అభీష్టానికి వ్యతిరేకంగా ఏ పోరాటాన్ని కూడా ఆయన సహించే స్థితిలో లేరు. ఆ క్రమంలోనే.. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా న్యాయం కోరుతూ.. చెన్నైలో జరిగిన దక్షిణాది మరియు పంజాబు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న మాటలు అవమానకరంగా ఉంటున్నాయి.

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానెల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో భారతియార్ కవితలతో ప్రసంగం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్.. ఆ తమిళ కవి పట్ల వ్యామోహాన్ని టీనేజ్ లోనే ఏర్పరచుకున్నట్టు చెప్పారు. అలాగే త్రిభాషా సిద్ధాంతం గురించి, హిందీ గురించి తన అభిప్రాయాలు కూడా వెల్లడించారు. హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే తనే అందుకు వ్యతిరేకంగా పోరాడుతానని కూడా అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. డీలిమిటేషన్ పట్ల తమ అభిప్రాయాలు, భయాలు వినిపించేందుకు ప్రయత్నిస్తున్న జేఏసీ గురించి మాట్లాడిన మాటలు మాత్రం మరో ఎత్తు.

ఇలాంటి వివాదం ఉన్నప్పుడు మొదట పార్లమెంటులో మాట్లాడాలని, తర్వాత పోరాడాలని అన్నారు. అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ లోని ఉద్యమశీలత ఇదేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫరెగ్జాంపుల్.. జగన్ పాలన కాలంలో ఏపీలో మరమ్మతులకు గురైన రోడ్లను బాగు చేయడం లేదని పవన్ కల్యాణ్ భావించారు. ముందు స్థానిక పంచాయతీలకు, మునిసిపాలిటీలకు లేఖలు రాసి, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చుకుని, అప్పటికీ పని జరగకపోతే ప్రభుత్వానికి లేఖలు రాసి.. ఆ తర్వాత కూడా ఉద్యమాలు చేయాల్సింది. కానీ.. పవన్ కల్యాణ్ ఒకేసారిగా.. నేను సొంత డబ్బులతో రోడ్లను బాగుచేస్తే.. అంటూ అటూ ఇటూ గాని మరమ్మతు పనులతో నాటకాలు ఎందుకు ఆడినట్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అసలు డీలిమిటేషన్ వంటి సీరియస్ అంశం తెరమీదకు వచ్చినప్పుడు.. కేంద్రప్రభుత్వమే స్వయంగా అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటుచేయాల్సి ఉండగా.. వారు విస్మరించిన పనిని స్టాలిన్ చేపట్టారని.. ఇది కేవలం అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం అని.. అలాంటి భేటీని ‘రోడ్డెక్కడం’గా పవన్ అభివర్ణించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గదని తాను దృఢంగా నమ్ముతున్నట్లు చెప్పడంలోనే పవన్ కల్యాణ్ అజ్ఞానం బయటపడుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కానీ ఒక సంగతి మాత్రం నిజం. ఒకవేళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కాకుండా ఉంటే.. ఈ వైఖరి మరో విధంగా ఉండేదని పవన్ కల్యాణ్ అంటున్నారు. అది మాత్రం నిజమే. ఎందుకంటే ఎన్డీయే కాకుండా కాంగ్రెస్ ఏలుతూ ఉంటే గనుక.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తామే అన్ని పార్టీలను కూడగట్టి.. కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కష్టపడుతూ ఉండేవారేమోనని ఆయన మాటలు విన్న ప్రజలు నవ్వుకుంటున్నారు.

13 Replies to “జేఏసీని అవమానించేలా పవన్ మాటలు!”

  1. హిందీభాష ని అధికార భాష చేస్తే దక్షిణాదిప్రజలఘోష వినేవాడెవడూ ఢిల్లీలో ఉండడు. అన్నీ జాతీయ భాషలయితే అధికారభాష ఏమిటో పవన్ చెప్పాలి.

  2. మన పావనం వ్యవహారం పాచిపోయిన లడ్డులు గుర్తుకి వస్తున్నాయి .

  3. మన పావనం వ్యవహారం పాచిపోయిన లడ్డులు గుర్తుకి వస్తున్నాయి .

  4. మన పావనం వ్యవహారం పాచిపోయిన లడ్డులు గుర్తుకి వస్తున్నాయి .

  5. మన పావనం వ్యవహారం పాచిపోయిన లడ్డులు XXXXగుర్తుకి వస్తున్నాయి .

  6. విభజన చట్టము ప్రకారము …ఆంధ్ర కి రావలిసిన …నిధులు ..నీళ్లు దొబ్బుతూ …దక్షిణ ది ..ఏందిరా 

  7. డీలిమిటేషన్ ఉద్యమం ఊహ జనితమైనది…..అస్సలు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు… వచ్ఛే ఏడాది మొదలు అవుతుంది….ఏమి జరకగాముందే క్లైమాక్స్ ఊహించేసి ఉద్యమాలు మొదలు పెడుతున్నారు తమిళ్ నాడు లో వచ్ఛే ఏడాది ఎన్నికల కారణంగా….. నిజంగా అన్యాయమే జరిగితే పవన్ తప్పక అదే ఉద్యమంలో ఉంటాడు…..జెగ్గు ఎలాగు nda లో లేడు…. ఉద్యమానికి ముందు ఉంది నడిపియ్యాలి కదా…. తాడో పేడో తేల్చుకోవాలి కదా….ఎక్కడ మీ పులివెందుల పులి, బెంగళూరులో పాలు తాగి బోజ్జుందా…..

  8. డీలిమిటేషన్ పై జగన్ రెడ్డితో పోరాటం చేయించుదాం…జే.ఏ.సి నాయకత్వం జగన్ రెడ్డికి ఇద్దాం. ఢిల్లీపై తొడకొట్టించి ఆనక బొక్కలో వేయిద్దాం.

  9. కుక్కా గారూ,

    మీ మాటలు చూస్తే, మీరు మానవత్వాన్ని మట్టిపారేస్తూ ఓ “హీనత గిన్నెస్ రికార్డు” కొట్టాలని ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీని మద్దతు ఇవ్వాలన్న పేరుతో, తల్లులను అవమానించడమే మీ గొప్పతనం అనుకుంటున్నారా? మీకూ తల్లి ఉందని ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లిదండ్రులు మీ తిట్ల ప్రదర్శన చూసి ఏ బాధ అనుభవిస్తారో ఊహించగలరా?

    అన్నీ వదిలేసి, తల్లిదేవోభవ అన్న మాట మిమ్మల్ని ఏ మాత్రం ప్రభావితం చేయదనుకుంటే, మిగిలినవాళ్లు మాత్రం మీ పార్ధకాన్ని చూసి పర్సనల్ కామెడీ షోగా ఎంజాయ్ చేసే రోజులొస్తాయేమో! మీరు నిజంగా భావిస్తున్నట్టు, ఇంత వల్గర్ మాటలతో ఎవరైనా మీకు బిరుదు ఇస్తారనే అపోహలో ఉంటే, అది నిజంగా అనర్థం.

    ప్రతీసారి తల్లులను తిడితే, కొద్దిగా మీ పరువే నశిస్తుందని గుర్తించండి. ఒక్కసారి బుద్ధి తెచ్చుకుని మారిపోయే ప్రయత్నం చేయండి. అలా చేయకపోతే, మిర్చీ మరిగిన పప్పులోవీడిలా మిగిలి, మీ పరువును మీరు ముంచెత్తే స్థితికి వెళతారనే విషయాన్ని మర్చిపోకండి.

    దేవుని దయతో, ఇప్పటికైనా మారండి. అంత ఎత్తున ఉండాల్సిన మానవత్వాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన తిట్ల వర్షాన్ని ఏదో ఒకరోజు మీరే తట్టుకోలేక పోతారు.

Comments are closed.