సల్మాన్ ఖాన్ తో సినిమా అంటే ఇలాగే వుండాలని రాజ్యాంగం వుందో లేక, అలాగే తీయాలని అనుకున్నారో మొత్తానికి సికిందర్ సినిమా ట్రయిలర్ చూస్తే మాత్రం మళ్లీ ఓ రొటీన్ కమర్షియల్ సినిమాను అందిస్తున్నారు అని అర్థమైపోయింది.
సల్మాన్ ఖాన్ అంటే తన ఇమేజ్ చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. న్యూ ఏజ్ డైరక్టర్లతో కొత్త తరహా సినిమాలు చేయలేకపోతున్నారు. కాస్త విషయం వున్న దర్శకుడు మురుగదాస్ కూడా ఇంకా పాత ఆలోచనా ధోరణిలోనే వుండిపోయినట్లు కనిపిస్తోంది.
సికిందర్ సినిమా సల్మాన్ చేసే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే వుంది. ఒకే హీరో, మూడు గెటప్ లు, మనం అనేక సార్లు చూసిన అజ్ఙాతవాసం టైపు క్యారెక్టర్ ఇలానే సాగింది. ట్రయిలర్ లో పాటల ప్లేస్ మెంట్ చూస్తే సినిమాలో కూడా ఇలాగే అతకకుండా వుంటే పరిస్థితి ఏమిటి అన్నట్లు వుంది. రష్మిక ఎవరి పక్కన అయినా ఇట్టే మ్యాచ్ అవుతుంది. అలాంటిది సల్మాన్ పక్కన అస్సలు మ్యాచ్ కాలేదు.
భారీ డైలాగులు, భారీ యాక్షన్ సీన్లు కలగలిపిన పాత రొటీన్ సినిమా చూడబోతున్నారు ప్రేక్షకులు అనే హింట్ ను ముందే ఇచ్చేసింది సికిందర్ ట్రయిలర్. మురుగదాస్ అంటే తుపాకి లాంటి వైవిధ్యమైన ప్లాట్ లతో వస్తారు అని ఎప్పటికప్పుడు అనుకోవడంతోనే సరిపోతోంది. కానీ రావడం మాత్రం కనిపించడం లేదు.
Ayo
7th సెన్స్ సినిమా తర్వాత మురుగా దాస్ లో రసం ఐపోయింది.. గజిని, తుపాకీ, అంటే ఇంగ్లీష్ సినిమాలు కాపీ చేసీ అల్లేశాడు, ఇప్పుడూ OTT లా పుణ్యమా అనీ అన్నీ భాషల సినిమాలు ఇంట్లో కే వచ్చేశాయ్ కాబట్టీ ఈ మూ.. దాస్ కీ కాపీ కొట్టడానికి కథ కథనాలు దొరకడం లేదు పాపం….




ఒక్క మురుగు das ye కాదు మన కాపీ guruji పరిస్తితి కూడ అదే
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,