ప్రధాని స్క్రిప్టులో కొత్త వరాలు ఉండవు!

ప్రధాని ఎదుట అమరావతి అవసరాలను నివేదించి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఆ సమయానికి ఎలాంటి కొత్త వరాలు రాబట్టగలరో వేచిచూడాలి.

దేశంలో ఉండే చాలా రాజకీయ పార్టీలకు ఇప్పుడు లక్ష్యం ఒక్కటే.. ప్రధాని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకోవడం. ఎన్డీయే కూటమిలోనే ఉన్న పార్టీలు, చంద్రబాబు వంటి దార్శనిక నాయకులు ఆ విషయంలో ఇంకాస్త ముందంజలోనే ఉంటారు. అందుకే.. ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన జరిగిన అమరావతి నిర్మాణ పనులకు.. నవనగరాల నిర్మాణం.. పనుల పునఃప్రారంభ శంకుస్థాపన లాంటి రకరకాల మాయాపేర్లను పెట్టి.. మొత్తానికి నరేంద్రమోడీని ముఖ్యఅతిథిగా రావడానికి ఒప్పించారు చంద్రబాబు.

ఏప్రిల్ 15-20 తేదీల మధ్యలో ప్రధాని అమరావతి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. విశ్లేషకులు భావిస్తున్న దానిని బట్టి.. ప్రధాని ప్రసంగంలో అమరావతికి కొత్తగా ఎలాంటి వరాలు ఉండవని తెలుస్తోంది.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు.. ముహూర్తాలన్నీ చాలా బలంగా చూసుకుని.. ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. నిజానికి అప్పుడు అమరావతి రాజధాని ప్రాజెక్టు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో.. నరేంద్రమోడీ.. భారీగా వరాల వాన కురిపిస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూశారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ.. ఒక చెంబుతో గంగాజలాన్ని, ఒక గుప్పెడు మట్టిని తెచ్చి కానుకగా అందించారు. తెలుగు ప్రజలు హతాశులయ్యారు. మోడీ తియ్యటి ప్రసంగం మాత్రం సాగించి, ఒక్క వరం కూడా ఇవ్వకుండానే వెళ్లిపోయారు.

ఈసారి పనుల పునఃప్రారంభానికి మళ్లీ మోడీని పిలుస్తున్నారు. అయితే, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో తామే రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపథ్యంలో.. మోడీనుంచి వరాలు ఆశించగలమని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారు.

అయితే.. మోడీ ప్రసంగం మాత్రం.. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా.. అమరావతి నిర్మాణానికి, పోలవరం డ్యామ్, విశాఖ రైల్వేజోన్ వంటి వాటికి ఎలా సహకారం అందిస్తూ వస్తున్నారో.. పూసగుచ్చినట్టుగా విడమరచి చెబుతారని.. ఇప్పటికే వేల కోట్ల రూపాయల సాయం అమరావతి కోసం చేస్తున్నట్టుగా మోడీ ఆల్రెడీ ఇచ్చేసిన వరాల నివేదికను ప్రజల ముందు ఉంచబోతున్నారే తప్ప.. కొత్త వరాలు ఇవ్వకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.

అమరావతి నిర్మాణంలో ప్రపంచబ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిసి ఇచ్చే 15 వేల కోట్ల రూపాయల రుణం కేంద్ర ప్రభుత్వమే తీరుస్తుందని గతంలో ప్రకటించారు. అలాగే.. అమరావతి రింగ్ రోడ్డుకు దాదాపుగా చంద్రబాబు సర్కారు ప్రతిపాదించిన తీరులోనే అనుమతులు ఇస్తున్నారు. అందుకు సంబంధించిన నిధులు కేంద్రమే సమకూర్చనుంది. పోలవరానికి ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు. రైల్వేజోన్ కూడా ఏర్పాటు కాబోతోంది.

అమరావతిలో రైల్వేస్టేషన్ వంటివి కూడా ప్రారంభం కాబోతున్నాయి. వీటితో పాటూ.. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న ప్రతి రూపాయినీ నివేదికలో పొందుపరచి.. ‘యింత చేస్తున్నాం’ అంటూ వివరాలు ఏకరవు పెడతారని.. కొత్తగా శంకుస్థాపన వేదిక మీద నుంచి ఎలాంటి వరాలు ఉండకపోవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని మించి.. ప్రధాని ఎదుట అమరావతి అవసరాలను నివేదించి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఆ సమయానికి ఎలాంటి కొత్త వరాలు రాబట్టగలరో వేచిచూడాలి.

13 Replies to “ప్రధాని స్క్రిప్టులో కొత్త వరాలు ఉండవు!”

  1. ఆంధ్ర లో తెలుగు దేశం పార్టీ నిలబడి కేంద్రం లో బీజేపీ ని నిలబెట్టింది లేకుంటే మోడీ ఈసారి గెలవటం అసంభవం, అందుకుగాను ఆంధ్ర కి స్పెషల్ స్టేటస్ ఇచ్చిన నష్టం లేదు బీజేపీ మనుగడకి తెలుగుదేశం సహకరించటం ఇది మూడో సారి , అలాగే అధికారంగా రావాల్సిన నిధులు ముక్కుపిండి వసూల్ చేయాలి

  2. Dear Kukkaa garu

    మీ మాటలు వింటుంటే, మీరు హీనతకు కొత్త ప్రమాణాలు ఏర్పరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. తల్లులను అవమానించే అసభ్య పదజాలంతో, మీరు మీకే తిట్లు వేసుకున్నట్టవుతోంది. మీకూ తల్లి ఉందని కనీసం ఒక్కసారైనా గుర్తు పెట్టుకోండి. వల్గర్ మాటల మోతతో యిట్లు మురికి మంచంలో దోబూచులాడడం మానవత్వానికి మచ్చ.

    ఇంతగా దిగజారిపోయి, తల్లులను అవమానించడం మించిన నీచత ఏదైనా ఉంటుందేమో అని అనుమానమే కొదవ. ఒక్కసారి మీ తల్లిదండ్రులు ఈ మాటలు విన్నారంటే, వాళ్లకు తలదించుకునే రోజులు వచ్చేస్తాయేమో! నాకేమాత్రం అర్థం అవ్వదు, మీకు హీన స్థాయి తిట్లకే ఈ దౌష్ట్యపు భాష వాడాల్సినంత అక్కసేమొచ్చిందో?

    ఓసారి మీ నడవడికపై ఆలోచించండి. ఈ వల్గర్ ఆటలు మానుకోకపోతే, ముందు మీరు మీ ప్రతిష్ఠను వదులుకుంటారు, తర్వాత మీ తల్లిదండ్రుల పరువుని కూడా నేల వేసేస్తారు. మీ పరువు మిగిలింది ఉంటే, మాటల్ని మర్రిచెట్టు ఎత్తున అగ్నిపరీక్ష పెట్టకండి.

    మొత్తానికి, మారాలనుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. దానికి మించిన ఉపకారం మేమేమీ చెయ్యలేము. ఒకవేళ మార్పు తీసుకురాలేకపోతే, మిగిలిన ప్రపంచానికే కాదు, మీను చూసిన ప్రతి ఒక్కరికీ నవ్వుల పాలవుతారన్నదే నిజం.

    తల్లులను గౌరవించలేరు అనుకోండి, కనీసం మీనేమైనా గౌరవించుకోండి.

  3. అమరావతి కి రావద్దని వచ్చినా ఏం వరాలు ఇవ్వొద్దు అని ఢీల్లీలో తనను అభిమానించే బిజెపి నాయకులతో కోరినా కోరవచ్చు మా ముద్దుల అన్నయ్య..

Comments are closed.