జగన్ కాదు కేటీఆర్.. సాయి రెడ్డి ఎందుకలా?

జగన్ అన్న మూడు అక్షరాలను కావాలనేనా విజయసాయిరెడ్డి విస్మరించారు అన్నది కూడా చర్చ సాగుతోంది.

వైఎస్ జగన్ కోసం ఏకంగా పదహారు నెలలు జైలు జీవితం చూసిన చరిత్ర ఆయనది. ఎవరైనా స్నేహం కోసమో బంధం కోసమో చేసేది ఒక లెవెల్ దాకా ఉంటుంది. కానీ కష్టాలు కడగండ్లూ కూడా పంచుకోవడం అన్నది ఒక్క విజయసాయిరెడ్డి విషయంలోనే జరిగింది. సీబీఐ కేసులలో జగన్ ఏ వన్ అయితే ఏటూ గా ఉంటూ ఆయన జైలు గోడల మధ్యన మగ్గారు.

అటువంటి విజయసాయిరెడ్డి జగన్‌కి తలలో నాలుకగా వ్యవహరించారు. జగన్ కోసం ఎందాకైనా అన్నట్లుగా ఆయన తీరు ఉండేది. ప్రత్యర్ధులు సైతం జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కరు చాలు అని వేయి నోళ్ళ పొగిడారు అంటే ఆ బంధం విలువ మాటలలో చెప్పరానిదే.

అయితే కాలం గొప్పది. అన్నింటికన్నా దానికే పదును పవర్‌ ఎక్కువ. ఆ కాలమే ఇప్పుడు జగన్- విజయసాయిరెడ్డిల మధ్యన అగాధాన్ని తెచ్చింది. ఎంతలా అంటే ఒకరి పేరుని మరొకరు తలచుకోనంతలా అని అంటున్నారు. అలా చూసుకుంటే కనుక దశాబ్దాలుగా స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ఉన్న జగన్- విజయ సాయి రెడ్డి ఇప్పుడు మాత్రం ఒకరినొకరు చూసుకునే స్థితిలో కూడా అసలు లేరు.

వైసీపీని వీడి సాయి రెడ్డి తన విశ్వసనీయతను కోల్పోయారని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా జగన్ అనుచరులే తనను వైసీపీ నుంచి దూరం చేశారని అంతా జగన్ కోటరీ వల్లనే అని విజయసాయిరెడ్డి ధీటైన బదులు ఇచ్చారు. వైసీపీలో ఏమి జరుగుతుంది అన్నది జగన్ ఇంకా అర్థం చేసుకోవడం లేదని కూడా ఆయన సెటైర్లు వేశారు.

ఇలా చూస్తే కనుక ఒకనాటి బలమైన బంధానికి బీటలు వారాయి. చూడబోతే వారిద్దరి మధ్య ఈ దూరం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. అది ఎంతదాకా అంటే జగన్ అన్న మూడు అక్షరాల గురించి విజయసాయిరెడ్డి మరచేటంతగా అని అంటున్నారు. విజయసాయిరెడ్డి జగన్ గారూ అని ట్వీట్లు చేసేవారు. అవన్నీ ఇపుడు పాత రోజులు అయ్యాయి. గట్టిగా చెప్పాలీ అంటే గతం అయ్యాయి.

ఇప్పుడు ఆయన ట్వీట్లలో ఎవరెవరో వస్తున్నారు. తాజాగా చూస్తే కనుక విజయసాయిరెడ్డి జగన్ కి తన మనసులో స్థానం లేదని చెప్పడానికి అన్నట్లుగా వేసిన ట్వీట్ లో ఏదో సూచనప్రాయంగా చెప్పినట్లు అయింది. ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ గా ఉన్న బర్న్ డీలిమిటేషన్ సమస్య గురించి ట్వీట్ చేస్తూ విజయసాయి రెడ్డి జగన్‌ను చాలా కన్వీనియెంట్ గా విస్మరించారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన చాలా వ్యూహాత్మకంగా కేటీఆర్‌ను ప్రశంసించారని అంటున్నారు.

అదెలా అంటే డీలిమిటేషన్ అంశం గురించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేయడం వల్ల మనకు నష్టం జరుగుతుందనే దక్షిణ భారత రాష్ట్రాల ఆందోళనలతో నేను ఏకీభవిస్తున్నాను. ఆందోళనలు నిజమైనవి అయినప్పటికీ, దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా సీట్లు కోల్పోదని న్యాయమైన పెరుగుదల జరుగుతుందని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన కూడా భరోసా ఇస్తుంది అని తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

ఇక ఏపీకి ప్రస్తుతం మొత్తం లోక్ సభలో 4.6 శాతం సీట్లు ఉన్నాయని చెప్పారు. అలాగే ఉత్తర ప్రదేశ్ కి 14.7 శాతం సీట్లు ఉన్నాయని అన్నారు. ఇక ఏదైనా పెరుగుదల జరిగినా కూడా కొత్త లోక్‌సభలో అదే శాతాన్ని కొనసాగించాలని అన్నారు. అలాగే పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడానికి రాష్ట్రాలలో సంబంధిత ఎమ్మెల్యే సీట్లు కూడా పెరగాలన్న కేటీఆర్ గారి సూచనతో తాను కూడా ఏకీభవిస్తున్నాను అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

అదే విధంగా దక్షిణ భారత రాష్ట్రాలను జనాభా ఆధారంగా కాకుండా జీడీపీకి వాటి సహకారాన్ని బట్టి వర్గీకరించాలనే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వాదనను విజయసాయి రెడ్డి ఆమోదించారన్నది ఆయన వేసిన ట్వీట్ ని చూస్తే చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది.

అదే సమయంలో డీలిమిటేషన్ కసరత్తుకు సంబంధించిన విషయంలో లాజికల్ గా చూడాలని దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించాలని దామాషా విధానంలో పునర్ విభజన జరగలాని వైసీపీ అధినేత హోదాలో వైఎస్ జగన్ కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారన్నది ఇక్కడ గమనించాలి.

మరి ఆ లేఖ విజయ సాయిరెడ్డి దృష్టికి రాలేదా లేక వచ్చినా కూడా ఆయన దానిని పట్టించుకోలేదా అన్నది ఇపుడు చర్చగా ఉది. ఎందుకటే విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ లో తన ప్రశంసలను కేవలం కేటీఆర్ కి మాత్రమే పరిమితం చేసి జగన్‌ను దూరంగా ఉంచారని అంటున్నారు. గతంలో జగన్ అని కలవరించిన ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఈ రోజున మాత్రం ఏ కారణం చేతనో తెలియదు కానీ కనీసంగా కూడా జగన్ పేరును ప్రస్తావించలేకపోతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ అన్న మూడు అక్షరాలను కావాలనేనా విజయసాయిరెడ్డి విస్మరించారు అన్నది కూడా చర్చ సాగుతోంది. చూడాలి మరి విజయసాయిరెడ్డి వైఖరి మీద ముందు ముందు మరింత స్పష్టత వస్తుందేమో.

17 Replies to “జగన్ కాదు కేటీఆర్.. సాయి రెడ్డి ఎందుకలా?”

  1. జగన్ వీడిని బీజేపీ కి దగ్గరుండి పంపిస్తున్నాడు బీజేపీకి y సిపి ki వారధి గా ఉపయోగ పడ్తాడని. వాళ్ళు ఇలాంటి వాళ్ళని మహా ప్రసాదంగా తీసుకుంటారు.

  2. అక్కడికి ఏదో వీళ్ళు దేశ స్వాతంత్ర కోసం జైల్ కి వెళ్ళినట్లు, ఇద్దరు 420, బోకు గాళ్ల ప్రజా ధనం దోచుకొని జైల్ కి వెళ్లారు, నువ్వూ నీ ఎలివేషన్స్!!. నీకు అసలు సిగ్గు అనేది ఉందా, వాడి పేరు వీడు రాయక పోతే నీకెంటిరా నొప్పి??

  3. అక్కడికి ఏదో వీళ్ళు దేశ స్వాతంత్ర కోసం జై*ల్ కి వెళ్ళినట్లు, ఇద్దరు 4*2*0, బోకు గాళ్ల ప్రజా ధనం దోచుకొని జై*ల్ కి వెళ్లారు, నువ్వూ నీ ఎలివేషన్స్!!. నీకు అసలు సి*గ్గు అనేది ఉందా, వాడి పేరు వీడు రాయక పోతే నీకెంటిరా నొ*ప్పి??

  4. మా జగన్ అన్న కి ఒక్క సజ్జల చాలు!!

    ఇలాంటి సాయి రెడ్లు ఎంత మంది పోయినా జగన్ అన్న కి వచ్చే నష్టమేమీ లేదు.

    మహా అయితే ఇంకో ఐదు సంవత్సరాలు పోరాడుతాడు….

    తరువాత ఎదురు చూసే ఓపిక తగ్గి, కేడర్ పోయి , చివరికి సజ్జల కూడా వదిలేస్తాడు.

    అక్కడితో ఆగుతుంది…..

    పాపం…. జగన్….

  5. సొంత ఇంటినే మంటపెట్టుకుని తమాషా చూసేటోళ్ళు మన వాళ్ళు అందుకే కొందరు చెబుతారు ఆంధ్ర (బాంద్ర ) అని కోతులకు కోతి బుద్ధులే ఉంటాయి

    ఒక రోజు రానే వస్తుంది యి లుచ్చా గాళ్ళ కుటుంబాలె నాశనమావుతాయి

Comments are closed.