రేష్మికి నచ్చే మగాడే లేడట

గతంలో రాజకుమారి పెళ్ళి కోసం స్వయం వరం అనే గొప్ప వేదిక వుండటం వల్ల వంద మందిలో నచ్చేవాడిని సెలక్ట్‌ చేసుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. జీవితంలో ఎదురైన మగాళ్ళను స్టడీ చేసి…

గతంలో రాజకుమారి పెళ్ళి కోసం స్వయం వరం అనే గొప్ప వేదిక వుండటం వల్ల వంద మందిలో నచ్చేవాడిని సెలక్ట్‌ చేసుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. జీవితంలో ఎదురైన మగాళ్ళను స్టడీ చేసి నచ్చినవాడిని కట్టుకోవడమే. ఈటీవీలో వచ్చే జబర్‌దస్త్‌ ప్రోగ్రామ్‌లో సరదాగా నటి, యాంకర్‌ రేష్మికి స్వయం వరం అనే చిన్న సీన్‌ చేశారు. 

తన బరువును మోసే టెస్ట్‌ పెట్టింది. డాన్సులు చేసే టెస్ట్‌ పెట్టింది. కవితలు చెప్పమంది. ఇక ఫిజికల్‌గా ఎవడిలో ఎంత సత్తా వుందో తెలుసుకోవడానికి బస్కీలు, పులప్స్‌ తీయించింది. అన్నీ అయ్యాక దండ పట్టుకుని నాగబాబుద గ్గరకు వెళ్ళి ‘సార్‌ వీళ్ళలో నాకు ఎవరూ నచ్చలేదు, నచ్చేవాడు దొరికే వరకూ ఈ దండ మీ దగ్గరే వుంచండి..’ అని చెప్పింది. 

నిజానికి అది జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అయినా యాంకర్‌ రేష్మి వ్యక్తిత్వానికి అద్దం పట్టిందనే చెప్పాలి. ఇంతవరకూ రేష్మికి నచ్చిన మగాడే దొరికి వుండడు. లేకపోతే ఇంతకాలం పెళ్ళి కాకుండా వుండలేదు కదా. రేష్మి కన్నా సెక్సీగా వుండే అనసూయకు పెళ్ళి అవడం వల్లే ఆమె రేటింగ్‌ తగ్గిపోయింది. ఇప్పుడు రేష్మి పెళ్ళాడినా అదే పరిస్థితి కాబట్టి, నచ్చే మగాడి వేటలో ఇంకెంత కాలం గడిపేస్తుందో మనం వేచి చూడాల్సిందే.