ఎవరైనా కానీ సంక్రాంతికి తమ సినిమా విడుదల కావాలని ఎందుకు కోరుకుంటారనే దానికి ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి సినిమాలకి వచ్చిన వసూళ్లే సమాధానమిచ్చాయి. గోపాల గోపాల చిత్రానికి ఏమంత గొప్ప టాక్ రాలేదు. కానీ పండగ సీజన్లో ఈ చిత్రం పండగ చేసుకుంది. దీనికి ఐ సినిమాకి వచ్చిన ఫ్లాప్ టాక్ కూడా హెల్ప్ అయింది.
శంకర్, విక్రమ్‌ల ఐ అనూహ్యంగా నిరాశపరిచింది. ఈ సినిమాకి వచ్చిన టాక్‌కి వేరే సీజన్లో వచ్చినట్టయితే బయ్యర్లు బుగ్గి అయిపోయేవారు. కానీ సంక్రాంతికి జనం సినిమాలు చూసే మూడ్‌లో ఉంటారు కాబట్టి టాక్ ఈ సినిమాని ఎఫెక్ట్ చేయలేదు. పండగ వరకు ఐ సినిమా పండగ చేసుకుంది. ఈ రెండు సినిమాలు ఆల్రెడీ వచ్చిన టాక్‌కి మించి వసూళ్లు సాధించాయి.
అయితే ఇంకా ఈ రెండు సినిమాలు పూర్తిగా సేఫ్ అవలేదు. సోమవారం నుంచి ఈ రెండిట్లో దేనికి ఆదరణ ఉంటుందో అదే సేఫ్‌గా అందర్నీ గట్టున పడేస్తుంది. ఏదేమైనప్పటికీ సిసలైన హిట్ టాక్ వచ్చిన సినిమా లేని లోటు అయితే కనిపించింది. ఈ టాక్‌తోనే వసూళ్లు ఇలా వచ్చాయంటే ఇక నిజంగా బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చిన సినిమా సంక్రాంతికి వచ్చి ఉంటే ఎలా ఉండేది?