`లెజెండ్‌`పై హిందీవాళ్ల మోజు!

తెలుగు చిత్రాల‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంటారు హిందీ నిర్మాత‌లు. ఇక్కడ ఏ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకొంటే… ఆ సినిమాని హిందీలో రీమేక్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇక్కడ ఫ్లాపైన సినిమాల్ని కూడా క‌ళ్లకు…

తెలుగు చిత్రాల‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంటారు హిందీ నిర్మాత‌లు. ఇక్కడ ఏ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకొంటే… ఆ సినిమాని హిందీలో రీమేక్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇక్కడ ఫ్లాపైన సినిమాల్ని కూడా క‌ళ్లకు అద్దుకొని తీసుకెళుతుంటారు. ఇటీవ‌ల విడుద‌లైన `లెజెండ్‌`పై కూడా హిందీవాళ్లు మ‌న‌సుప‌డ్డార‌ట‌. 

ఈ చిత్రానికి ఏపీలోనూ, ఓవ‌ర్సీస్‌లోనూ భారీస్థాయిలో వ‌సూళ్లు ద‌క్కుతుండం హిందీవాళ్ల దృష్టికి వెళ్లింద‌ట‌. దీంతో వాళ్లు హ‌డావుడిగా సినిమాని చూశార‌ట‌. ఓ ప్రముఖ సీనియ‌ర్ హీరోపై `లెజెండ్‌` సినిమాని రీమేక్ చేయాల‌ని నిర్ణయించుకొని స‌దరు హిందీ నిర్మాత‌లు హైద‌రాబాద్‌కి వ‌చ్చార‌ట‌. 14రీల్స్ సంస్థని సంప్రదించేందుకు ప్రయ‌త్నాలు ఆరంభించార‌ట‌. 

14 రీల్స్ నిర్మాత‌లు మాత్రం రీమేక్ రైట్స్‌ని భారీగా చెబుతున్నార‌ట‌. మ‌రి హిందీ నిర్మాత‌లు అంత ధ‌ర‌కు కొనుక్కొంటారో లేదో అని `లెజెండ్‌` సినిమాకి  సంబంధించిన  ఓ సాంకేతిక నిపుణుడు తెలియ‌జేశాడు. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రమిది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శక‌త్వం వ‌హించారు. బాల‌కృష్ణ సినిమాపై ఇలా హిందీవాళ్లు ఆస‌క్తి చూప‌డం ఇదే తొల‌సారి అంటున్నారు.