ఆంగ్ల సంవత్సరాది అయినా, తెలుగు సంవత్సరాది అయినా.. కొత్త సంవత్సరం కోటి ఆశల్ని నెరవేర్చేదిగా వుండాలని కోరుకుంటాం. నేడు తెలుగు సంవత్సరాది. గత ఏడాది తీపి గుర్తుల్ని వెంటేసుకుంటూ, గడచిన చేదు అనుభవాలు పునరావృతం కాకూడదని ఆశిద్దాం.
తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్నా.. ఐక్యంగా తెలుగు జాతి భవిష్యత్తులో మున్ముందుకు దూసుకుపోయేలా, తెలుగు ప్రజలకు అన్ని రంగాల్లోనూ విజయం చేకూరేలా ఈ జయనామ సంవత్సరం వుండాలనే ఆకాంక్ష ప్రాంతాలకతీతంగా అందరిలోనూ వ్యక్తమవ్వాల్సిన తరుణమిది.
అచ్చ తెలుగు సంప్రదాయానికి ప్రతీక అయిన ఉగాది పండుగ అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్ ఆకాంక్షిస్తోంది. పాఠకులకు, ప్రకటనకర్తలకు గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్ ‘జయనామ సంవత్సర’ ఉగాది శుభాకాంక్షలు.