ఎందుకొచ్చిన పాలిటిక్స్‌ బాబూ

ఎన్నికల సీజన్‌ స్టార్ట్‌ అవడంతో సినీ తారల్లో చాలా మంది రాజకీయ రంగంలోకి దిగి సేవ చేయాలని తపించిపోతున్నారు. ఎలక్షన్స్‌లో డైరెక్ట్‌గా కంటెస్ట్‌ చేయడం ఇష్టం లేని కొందరు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లో పడి…

ఎన్నికల సీజన్‌ స్టార్ట్‌ అవడంతో సినీ తారల్లో చాలా మంది రాజకీయ రంగంలోకి దిగి సేవ చేయాలని తపించిపోతున్నారు. ఎలక్షన్స్‌లో డైరెక్ట్‌గా కంటెస్ట్‌ చేయడం ఇష్టం లేని కొందరు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లో పడి జనాన్ని జాగృతం చేసే పనిలో ఉన్నారు. అయితే రాజకీయాలపై ఆసక్తి ఉన్నా కూడా ఈ ఎలక్షన్స్‌ వరకు సైడ్‌ అయిపోయారు మన ప్రముఖ దర్శకులిద్దరు. 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి చాలా రకాలుగా మద్దతిచ్చిన పూరి జగన్నాథ్‌ ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటాడని అనుకున్నారు. కానీ తన మద్దతు ఆ పార్టీకే అయినా కానీ తనకైతే రాజకీయాలు ఆసక్తి లేవని పూరి జగన్నాథ్‌ స్పష్టం చేసాడు. సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నానని, ఇదే కంటిన్యూ చేస్తానని అతను తేల్చేసాడు. 

మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆమధ్య పావులు కదిపిన వి.వి. వినాయక్‌ కూడా ఈసారికి రాజకీయాలకి దూరంగా ఉండాలని డిసైడ్‌ అయ్యాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న సినిమాతో వినాయక్‌ బిజీగా ఉన్నాడు. 2019కి ఏమైనా రెడీ అవుతాడేమో చూడాలి.