మెగా ఫ్యామిలీలో అందరూ చిరంజీవి సైడే నిలబడిపోదామని డిసైడ్ అయ్యారు. కళ్యాణ్ అంటే ఇష్టమున్నా కానీ అతని వెంట నిలిచేందుకు, అతనికి మద్దతు తెలిపేందుకు మెగా ఫ్యామిలీ ఇష్టపడ్డం లేదు. పెద్దాయన మీద గౌరవంతోనో, ఈ వయసులో ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేకనో అందరూ ఆయన వైపే ఉండిపోయారు.
మిగతా వారి మాట ఎలా ఉన్నా కానీ అల్లు అర్జున్‌కి అయితే మేనమామ వెంట నిలబడ్డానికో బలమైన కారణముంది. తనకి పిల్లనిచ్చిన మావయ్య కాంగ్రెస్ పార్టీ తరఫునే ఎన్నికల బరిలో దిగుతున్నాడు కాబట్టి అటు మేనమామ, ఇటు మావయ్య, ఆబ్వియస్గా నాన్న అందరూ ఉన్న కాంగ్రెస్‌కే బన్నీ ఓటు పడిపోయింది.
ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని కబుర్లు చెప్పిన వాడైనా కానీ ‘రేసు గుర్రం’ ఆడియోకి కేవలం చిరంజీవి వస్తే చాలని బన్నీ అనుకున్నాడు. అంతే కాదు పవన్ అభిమానులుగా పేరున్న ఎవరినీ కూడా ఆడియో ఫంక్షన్‌కి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్స్‌క్లూజివ్ మెగా ఫాన్స్‌కి మాత్రమే ఇన్విటేషన్స్ వెళ్లాయి. దీనిని బట్టి పవర్ ఫాన్స్ సపోర్ట్ తనకి అక్కర్లేదని బన్నీ ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. ఇతడి త్యాగాన్ని చూసయినా ఎక్స్‌క్లూజివ్ ‘మెగా’ ఫాన్స్ బన్నీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి తీరాలి.