నాగబాబు సపోర్ట్‌ అన్నకా, తమ్ముడికా?

పవన్‌కళ్యాణ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమని గట్టిగా వినిపిస్తోంది. కొత్త పార్టీ పెట్టకపోయినా కానీ ఆల్రెడీ ఉన్న ఒక పార్టీకి పవన్‌ మద్దతు ప్రకటిస్తాడని, ఎన్నికల్లో పోటీ కూడా చేయవచ్చునని వినిపిస్తోంది. అయితే పవన్‌…

పవన్‌కళ్యాణ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమని గట్టిగా వినిపిస్తోంది. కొత్త పార్టీ పెట్టకపోయినా కానీ ఆల్రెడీ ఉన్న ఒక పార్టీకి పవన్‌ మద్దతు ప్రకటిస్తాడని, ఎన్నికల్లో పోటీ కూడా చేయవచ్చునని వినిపిస్తోంది. అయితే పవన్‌ తన అన్న చిరంజీవి ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అయితే జాయిన్‌ అవడం లేదు. 

అన్నయ్యతో విబేధాలు లేవని చెబుతున్న తమ్ముడు రాజకీయంగా మాత్రం తన దారి వేరే అని చాటుకోబోతున్నాడు. పవన్‌ కనుక వేరే పార్టీలో చేరితే నాగబాబు పరిస్థితి అడకత్తెరలో పడుతుంది. తన మద్దతు అన్నకి ఇవ్వాలో, తమ్ముడికి ఇవ్వాలో తెలియక తికమక ఏర్పడుతుంది. 

మెగా అభిమానుల్ని అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి, వారితో నిత్యం నాగబాబు ఇంటరాక్ట్‌ అవుతుంటాడు. పవన్‌ అభిమానులు, చిరు అభిమానులు అందరూ నాగబాబునే కలిసేవారు. పవన్‌ కనుక రాజకీయంగా సెపరేట్‌ రూట్‌ తీసుకుంటే ఫాన్స్‌లో కూడా పొలిటికల్‌గా క్లియర్‌ డివైడ్‌ వస్తుంది. మరి అప్పుడు నాగబాబు ఎవరి వైపు వెళతాడు… ఎవరికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తాడు. అసలే వేడిగా ఉన్న మన తెలుగు రాజకీయాలు పవన్‌ వస్తాడనే టాక్‌తో ఇంకాస్త ఆసక్తికరంగా మారాయి.