ఏదైనా సినిమాకి ఓపెనింగ్స్ రాగానే బయ్యర్స్‌తో పాటు ఎగ్జిబిటర్స్ కూడా తెగ సంబర పడిపోతున్నారు. కొంతకాలంగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద తాండవిస్తున్న కరువు కాస్తయినా తీరుతుందని ఆశ పడుతున్నారు. అయితే ఈమధ్య వచ్చిన సినిమాలు కేవలం ఆరంభ శూరత్వం చూపించి తర్వాత ధడేల్‌మని పడిపోతున్నాయి.
‘భీమవరం బుల్లోడు’ చిత్రానికి టాక్ బాలేకున్నా మొదటి నాలుగు రోజుల్లో వసూళ్లు బాగా వచ్చాయి. బి, సి సెంటర్స్ సినిమా కాబట్టి వీక్ డేస్‌లో డ్రాప్ అవదని అనుకున్నారు. కానీ ఈ చిత్రం కలెక్షన్స్ సడన్‌గా డ్రాప్ అయిపోయాయి. హార్ట్ ఎటాక్ చిత్రానికి కూడా ఇదే జరిగింది. వీకెండ్స్‌లో కలెక్షన్స్ బాగున్నా కానీ వీక్ డేస్‌లో డెడ్ వీక్ కలెక్షన్స్ ట్రెండ్ రన్ అయింది.
పరీక్షల సీజన్ కావడంతో సినిమా బిజినెస్ ఏమాత్రం బాలేదిప్పుడు. దానికి తోడు ఏషియా కప్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా కొంతవరకు కలెక్షన్స్‌ని దెబ్బ తీస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలనే కాదు… అన్ని భాషల్లో, అన్ని రాష్ట్రాల్లోను పరిస్థితి ఇలానే ఉంది. తమిళ చిత్రాల కలెక్షన్స్ కూడా దయనీయంగా ఉన్నాయని కోలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్.