బాబు బాలీవుడ్‌కి వెళ్తాడంట

జగపతిబాబు హీరో వేషాలు మానేసి ఇప్పుడు ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా చేసేస్తున్నాడు. దీంతో జగపతిబాబు సడన్‌గా చాలా బిజీ అయిపోయాడు. లెజెండ్‌లో విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్న జగపతిబాబుకి ఆ సినిమాలోని లుక్‌కి చాలా కాంప్లిమెంట్స్‌…

జగపతిబాబు హీరో వేషాలు మానేసి ఇప్పుడు ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా చేసేస్తున్నాడు. దీంతో జగపతిబాబు సడన్‌గా చాలా బిజీ అయిపోయాడు. లెజెండ్‌లో విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్న జగపతిబాబుకి ఆ సినిమాలోని లుక్‌కి చాలా కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. మన తెలుగు సినిమాకి తెలుగు విలన్‌ దొరికేసాడని కితాబులిస్తున్నారు. 

అలాగే మరికొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్న జగపతిబాబు ఇక హీరోగా నటించనని తేల్చేసాడు. ఎలాగో తాను హీరోగా నటించిన సినిమాలకి కలెక్షన్స్‌ రావడం లేదు కాబట్టి తనకున్న పాపులారిటీని వేరే సినిమాలకి అడ్వాంటేజ్‌ చేస్తే మంచిదని భావిస్తున్నాడు. 

అలాగే ఇంతకాలం తెలుగులో తప్ప వేరే భాషల్లో పెద్దగా నటించని జగపతిబాబు ఇప్పుడు బాలీవుడ్‌పై కూడా ఆసక్తి చూపుతున్నాడు. కొందరు తెలుగు దర్శకులు అక్కడ బిజీగా ఉండడంతో వారికి తన ఇంట్రెస్ట్‌ గురించి చెబుతున్నాడు. విలన్‌ క్యారెక్టర్స్‌ అయినా, స్పెషల్‌ రోల్స్‌ అయినా చేస్తానని చెబుతూ తనని తాను ప్రమోట్‌ చేసుకుంటున్నాడు.