మ‌హేష్‌ని ఇబ్బంది పెడుతున్నాడా?!

అస‌లే ఎర్రటి ఎండ‌లు. ఆపై బొగ్గు గ‌నులు. అక్కడ షూటింగ్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎండ వేడిమిలో, దుమ్ము ధూళి మ‌ధ్య షూటింగ్ చేయ‌లేక మ‌హేష్‌బాబు ఉక్కిరిబిక్కిర‌వుతున్నాడ‌ట‌. `ఆగ‌డు` సినిమా కోసం ఇటీవ‌ల…

అస‌లే ఎర్రటి ఎండ‌లు. ఆపై బొగ్గు గ‌నులు. అక్కడ షూటింగ్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎండ వేడిమిలో, దుమ్ము ధూళి మ‌ధ్య షూటింగ్ చేయ‌లేక మ‌హేష్‌బాబు ఉక్కిరిబిక్కిర‌వుతున్నాడ‌ట‌. `ఆగ‌డు` సినిమా కోసం ఇటీవ‌ల బ‌ళ్లారి వెళ్లారు. అక్కడి గ‌నుల్లో మ‌హేష్‌పై   టైటిల్‌సాంగ్‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఏ ఫైట్ కోస‌మో, స‌న్నివేశాల కోస‌మో… గ‌నుల్లోకి వెళుతుంటారు. 

కానీ పాట కోసం శ్రీనువైట్ల అక్కడికి వెళ్లారు. `దూకుడు`లో టైటిల్ సాంగ్‌ని ఎంత వెరైటీగా తీశారో..  అదే త‌ర‌హాలో `ఆగ‌డు` టైటిల్‌సాంగ్ ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మ‌హేష్‌ని అక్కడికి తీసుకెళ్లార‌ట‌. అయితే అక్కడ వాతావ‌ర‌ణం చూసి మ‌హేష్ ఇబ్బంది ప‌డుతున్నాడ‌ట‌. 

శ్రీనువైట్ల మాట కాద‌న‌లేక వ‌చ్చానుకానీ… ఇక్కడ షూటింగ్ చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నాడ‌ట‌. మ‌హేష్‌ని కూల్ చేయ‌డానికో ఏమో.. నిన్ననే శ్రీనువైట్ల సూప‌ర్‌స్టార్‌కి హ్యాట్సాఫ్ చెప్పాలి, సినిమా కోసం చాలా క‌ష్టప‌డుతున్నాడంటూ ట్విట్ చేశాడు.