‘అత్తారింటికి దారేది’ సినిమాతో బ్రేక్ సాధించిన ప్రణీత ఇప్పుడు ఎన్టీఆర్‌తో ‘రభస’ చేస్తోంది. పవన్‌కళ్యాణ్ సరసన ప్రమీల పాత్రలో మెరిసిన ప్రణీతకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది. ‘అత్తారింటికి’ ముందే ప్రణీత కమిట్ అయిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఇటీవలే విడుదలైంది.
ఆ సినిమాలో చాలా గ్లామరస్‌గా కనిపించి తనలో ఈ కోణం కూడా ఉందని చూపించిన ప్రణీత రీసెంట్‌గా కన్నడలో భారీ హిట్ కొట్టింది. తనకిప్పుడు ఉన్న డిమాండ్‌కి తగ్గట్టే ఛార్జ్ చేయాలని ప్రణీత భావిస్తోందని, తన రెమ్యూనరేషన్ అమాంతం రెట్టింపు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఇంతవరకు ఎక్కువ సినిమాలు సైన్ చేయలేకపోవడానికి కూడా కారణం ఇదేనని అంటున్నారు.
మరో రెండు హిట్లు పడితే తన పారితోషికం ఎలాగో నిర్మాతలే పెంచేస్తారు. ఇప్పుడు వస్తున్న వారిని బెదరగొట్టడం వల్ల గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం మినహా ఏం చేయడానికి ఉండదని ప్రణీత గ్రహిస్తే మంచిది.