మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆయన తెరకు పరిచయం కాబోతున్నారు. ఆ చిత్రానికి ఈ నెల 27న కొబ్బరికాయ కొడుతున్నారు. మార్చి నెలాఖరి నుంచి సెట్స్‌పైకి తీసుకెళతారని సమాచారం. `గొల్లభామ` పేరుతో గోదావరి నేపథ్యంలో సాగే ఓ కథని తెరపై చూపిస్తారని ప్రచారం సాగుతోంది.
అయితే తాజా సమాచారం మేరకు… ఈ సినిమా పేరు మారబోతోందట. `గొల్లభామ` అనే పేరు అభిమానులకు నచ్చేలా లేదని, అందుకే ఇంకో పేరు సూచించాలని మెగా కథానాయకులు సలహా ఇచ్చారట. ఆమేరకు ఓ కొత్త పేరును ఆలోచించే పనిలో ఉందట చిత్రబృందం. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. 27న జరిగే సినిమా ప్రారంబోత్సవానికి మెగా కథానాయకులంతా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.