మహేష్‌ సినిమాకి భారీ గ్రౌండ్‌ వర్క్‌

మహేష్‌బాబుతో మణిరత్నం సినిమా అయితే గ్యారెంటీగా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇంతవరకు హీరో కానీ, డైరెక్టర్‌ కానీ ఈ ప్రాజెక్ట్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహేష్‌ అయితే తనని ఎవరూ సంప్రదించలేదని ఇన్‌డైరెక్ట్‌గా…

మహేష్‌బాబుతో మణిరత్నం సినిమా అయితే గ్యారెంటీగా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇంతవరకు హీరో కానీ, డైరెక్టర్‌ కానీ ఈ ప్రాజెక్ట్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహేష్‌ అయితే తనని ఎవరూ సంప్రదించలేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసాడు. 

కానీ మహేష్‌, నాగార్జునతో మణిరత్నం మల్టీస్టారర్‌ గ్యారెంటీ అని న్యూస్‌ సర్కిల్స్‌ నొక్కి వక్కాణిస్తున్నాయి. మణిరత్నం అంటే విపరీతమైన గౌరవాభిమానాలు ఉన్నాయి కాబట్టి ఈ చిత్రానికి మహేష్‌ నో చెప్పడని అనుకుంటున్నారట. మరి రాత పూర్వక ఒప్పందాలు చేసుకోకుండా సినిమా కాన్‌క్రీట్‌గా ఎలా ఓకే అయిపోతుందనేది వారికే తెలియాలి. 

ఇకపోతే ఈ చిత్రం కోసం మణిరత్నం గ్రౌండ్‌ వర్క్‌ మొదలు పెట్టాడని, స్టార్‌ కాస్ట్‌ ఫైనలైజ్‌ చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హాని అడిగారట. ఆమె బిజీగా ఉండడంతో డేట్స్‌ కేటాయించలేకపోయిందని న్యూస్‌. ఆగడు తర్వాత మహేష్‌ పూరి జగన్నాథ్‌ సినిమాతో పాటు ఇది కూడా ప్యారలల్‌గా స్టార్ట్‌ చేస్తాడట.