Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ సిన్మాతో పండగ చేసుకుంటున్నాడు

బన్నీ సిన్మాతో పండగ చేసుకుంటున్నాడు

అల్లు అర్జున్‌ ఇప్పుడు చాలా బిజీ అయిపోవడంతో తనకి నచ్చిన కథలతో కూడా వెంటనే సినిమా స్టార్ట్‌ చేయలేకపోతున్నాడు. అతనే కావాలని వెయిట్‌ చేసే వాళ్లు వెయిట్‌ చేస్తుంటే, అంత ఓపిక లేని వాళ్లు వేరే హీరోలని వెతుక్కుంటున్నారు. అల్లు అర్జున్‌ కోసం కథ రెడీ చేసిన డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ఇప్పుడదే కథతో రామ్‌ హీరోగా సినిమా చేస్తున్నాడు. 

అల్లు అర్జున్‌తో చేసే సినిమాకి ‘పండగ చేస్కో’ అనే టైటిల్‌ పెట్టాడు. రామ్‌ సినిమాకి కూడా అదే టైటిల్‌ ఫిక్స్‌ చేయడంతో ఆ కథ యాజిటీజ్‌గా రామ్‌కి షిఫ్ట్‌ అయిపోయిందనే సంగతి క్లియర్‌ అయింది. అల్లు అర్జున్‌ నటిస్తే ఈ చిత్రాన్ని నిర్మిద్దామని అనుకున్న దిల్‌ రాజు హీరో మారడంతో తాను కూడా డ్రాప్‌ అయ్యాడు. 

ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్‌ నిర్మించబోతున్నాడు. ఇందులో రామ్‌ సరికొత్త గెటప్‌తో కనిపిస్తాడట. ఫ్లాప్‌ స్ట్రీక్‌లో ఉన్న రవితేజకి బలుపుతో హిట్‌ ఇచ్చిన గోపీచంద్‌ మలినేని ఇప్పుడు రామ్‌తో కూడా సేమ్‌ ఫీట్‌ రిపీట్‌ చేస్తాడని అనుకుంటున్నారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?