అంతా చరణే చూసుకోవాలి

కృష్ణవంశీ ‘పైసా’ చిత్రం ఏమైనా క్లిక్‌ అయితే చరణ్‌తో చేసే సినిమాకి కాస్త ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్‌ వస్తుందని అనుకున్నారు. కానీ పైసా కూడా ఫ్లాప్‌ అయిపోవడంతో కృష్ణవంశీ నుంచి హిట్‌ వచ్చి చాలా కాలం…

కృష్ణవంశీ ‘పైసా’ చిత్రం ఏమైనా క్లిక్‌ అయితే చరణ్‌తో చేసే సినిమాకి కాస్త ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్‌ వస్తుందని అనుకున్నారు. కానీ పైసా కూడా ఫ్లాప్‌ అయిపోవడంతో కృష్ణవంశీ నుంచి హిట్‌ వచ్చి చాలా కాలం అయిపోయింది. ఇక ఈ చిత్రానికి పూర్తిగా చరణే కొమ్ము కాయాలి. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని కృష్ణవంశీ హైప్‌ తేవడానికి ట్రై చేస్తున్నా కానీ ఎవరూ అది సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేదు. 

ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషించి ఉంటే మల్టీస్టారర్‌ హోదాలో అయినా క్రేజ్‌ వచ్చి ఉండేది. కానీ శ్రీకాంత్‌ ఆ పాత్ర చేస్తున్నాడు కాబట్టి అతని వైపు నుంచి తోడయ్యే ఆకర్షణ ఏమీ ఉండదు. సో… ఈ సినిమాకి సంబంధించి హోల్‌ అండ్‌ సోల్‌ చరణే కొమ్ము కాయాలి. దీనిని అతనే మోయాలి. 

బండ్ల గణేష్‌ బడ్జెట్‌ ఎంత పెడుతున్నాడో కానీ చరణ్‌ ప్లస్‌ ఒక మామూలు డైరెక్టర్‌ కాంబినేషన్‌ సినిమాకి ఎంత ఖర్చు పెడితే సేఫ్‌ అనేది లెక్క చూసుకుని అంతే డబ్బులు పెడితే మంచిది. రచ్చ తర్వాత చరణ్‌ కంప్లీట్‌గా తానే మోయాల్సిన ప్రాజెక్ట్‌ ఇదే అవుతుంది. తన బలమైన మాస్‌ జోనర్‌ వదిలి ఫ్యామిలీ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈసారి తనెంత వరకు దీనిని కాపాడతాడనేది కూడా సందేహమే!