షకీలా ఆత్మ కథ రాస్తుందనగానే కొన్ని గుండెలు ఉలిక్కిపడ్డాయి. ఇంకొందరు.. జేబులు ఊవ్విళ్లూరాయి. అవును.. షకీలా ఆత్మకథతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది?? అనే ఆలోచనల్లో పడిపోయారు నిర్మాతలు. అందుకే ఆత్మ కథని సినిమాగా తీస్తామంటూ షకీలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నారట. తెలుగు, తమిళం, మలమయాళంలో ఈ సినిమాకి పిచ్చ డిమాండ్ ఉండి తీరుతుందనేది నిర్మాతల భరోసా.
కాస్త సెక్స్, ఇంకొంచెం సెంటిమెంట్ టచ్ ఇస్తే ఈ సినిమా అందరికీ చేరువ అవ్వడం ఖాయమని నిర్మాతలు లెక్కలుకడుతున్నారు. షకీలా పాత్రకు ఎవరైతే బాగుంటారా?? అనే చర్చల్లో పడిపోయారు కూడా. తెలుగు, తమిళ సీమల్లో అందరికీ పరిచయం అయిన నాయిక అయితే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. ఈ పాత్ర కోసం అంజలిని సంప్రదిస్తున్నారట.
అంజలి అయితే అన్ని ఎమోషన్లనూ చూపించగలదు అన్నది నిర్మాతల పీలింగ్. బాలీవుడ్‌లో దర్టీపిక్చర్ స్థాయిలో అటు అవార్డులు, ఇటు కాసులూ రాలాలన్న ధ్యేయంగా ఈ సినిమా తీయబోతున్నార్ట. మరి షకీలాగా కనిపించడానికి సీతమ్మ ఒప్పుకొంటుందా? లేదా? అన్నదే అనుమానం. ఏం జరుగుతుందో చూడాలి.