వెయ్యి, లక్ష, కోటీ కాదు… ఏకంగా రూ.85 కోట్లు పోతే.. మనిషి ఏమైపోతాడు? వైరాగ్యం, విరక్తి అన్నీ కట్టకట్టుకొని వచ్చేస్తాయ్. నిరాశ, నిస్పృహలకు కేరాఫ్ అడ్రస్ గామారిపోతారు. కానీ అతను మాత్రం అలా కాలేదు. పోతే పోనీ.. అనుకొని వదిలేశాడు. మళ్లీ సంపాదించడం మొదలెట్టాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకొంటున్నారు..? పూరి జగన్నాథ్.
జీవితం మీద ఒకరకమైన ప్రేమ ఉన్నవాడు పూరి జగన్నాథ్. లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో పూరికి తెలిసినంతగా మరొకరికి తెలీదేమో..? పైసలు ఉన్నా, లేకున్నా ఆయన ఒకేలా ఉంటారు. దశాబ్కాలం పాటు పూరి హవా… హైపిచ్‌లో సాగింది. ముట్టుకొన్నదల్లా బంగారమే. ఓ దశలో డబ్బే డబ్బు.
అలాంటప్పుడు ఒకేసారి రూ.85 కోట్లు పోయాయట. అలా పోయినందుకు బెంగ పడేలేదు. డీలా పడిపోలేదు. మళ్లీ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. ఈ విషయాన్ని పూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంత డబ్బు పోయి కూడా రాయిలా ఉండిపోయాడంటే పూరి నిజ్జంగా గ్రేటే. మరి ఆ రూ.85 కోట్లు ఎలా పోయాన్నది మాత్రం సస్పెన్స్. ఎనీ గెస్..?!