కృష్ణవంశీ మల్టీస్టారర్‌లో మరో మలుపు. కృష్ణవంశీ – రామ్‌చరణ్‌ల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడని, నాగ్ – చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ కృష్ణవంశీ నాగార్జునని సంప్రదించలేదట.
కథ విన్న తరువాత నాగ్ ఎలా స్పందిస్తాడో, ఒప్పుకొంటాడో లేడో… అనే సందిగ్థం చిత్రబృందంలో ఉంది. నాగ్ నో అంటే.. ఎవరిని ఎంపిక చేయాలి?? అనే విషయంలోనూ చిత్రబృందం ఇప్పుడిప్పుడే ఓ నిర్ణయానికి వస్తోంది. నాగ్ కాదంటే.. ఆ పాత్రకి జగపతిబాబుని ఎంచుకోవాలని భావిస్తోందట.
కృష్ణవంశీ – జగపతిబాబు అనగానే అంతఃపురం గుర్తొస్తుంది. పాతికేళ్ల కెరీర్లో ఆ సినిమా ఎప్పటికీ గుర్తించుకొంటాడు జగపతి. అలాంటిది కృష్ణవంశీ పిలిస్తే జగపతి నో చెప్పే అవకాశమే లేదు. లెజెండ్ నుంచి ప్రతినాయకుడి ప్రయాణం మొదలెట్టిన జగపతి కెరీర్లో ఈ సినిమా మరో మైలురాయిగా మిగిలే అవకాశం ఉంది.