గొప్ప స్టార్. సినిమాకి పదిహేను కోట్లు తగ్గడు. ఊ.. అంటే అడ్వాన్సులు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధం… అలాంటి రేంజ్ పవన్ కల్యాణ్‌ది. అయితే ఇప్పుడీ స్టార్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్నాడనేది ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ దగ్గర డబ్బుల్లేవట. అందుకే.. కొన్ని సినిమాల్ని డబ్బుల కోసం ఒప్పుకొంటున్నాడని తెలుస్తోంది. పారితోషికం సింగిల్ పేమెంట్‌లో ఇచ్చినందుకే ఓమైగాడ్ సినిమాని ఒప్పుకొన్నాడట.
గబ్బర్ సింగ్ 2 ఆలస్యం అవ్వడానికి కారణం కూడా ఆర్థిక సమస్యలే అని తెలుస్తోంది. పేరుకు శరత్ మరార్ నిర్మాత అయినా.. నిర్మాణంలో అంతో ఇంతో.. పవన్ భాగస్వామ్యం కూడా ఉంటుంది. దానికి తోడు స్నేహితుడి కోసం చేస్తున్న సినిమా. పారితోషికం రూపంలో డబ్బులు రావు. ఈలోగా మరో సినిమా చేసుకొంటే.. చేతిలో డబ్బులైనా ఉంటాయన్నది పవన్ ఆలోచన.
అందుకే గబ్బర్ సింగ్2 ని పక్కన పెట్టి ఓమైగాడ్‌ని ఓకే చేశాడట. రేణుకా దేశాయ్ వ్యవహారం సెటిల్‌మెంట్ చేయడానికి పవన్ అప్పులు చేశాడని, అడిగినవారికి లేదనకుండా ఇచ్చే నైజం వల్ల… డబ్బుల్ని కూడబెట్టుకోలేకపోయాడని, పాత బాకీలూ పవన్‌ని వెంటాడుతున్నాయని తెలుస్తోంది. మరి వీటి నుంచి పవన్ ఎప్పుడు బయటపడతాడో..?