వరుస ఫ్లాపులతో రామ్ కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. లవ్‌స్టోరీలు బెడసి కొడుతున్నాయి. మాస్ మసాలాలు చేదెక్కాయి. మల్టీస్టారర్లు.. నిర్మాతలకు చుక్కలు చూపించాయి. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన మార్కెట్‌నీ, తన క్యాపబులిటీస్ ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని సినిమాల్ని ఎంచుకోవాలన్నది మాత్రం అర్థమైంది.
అందుకే ఈసారి ప్రయోగాల జోలికి పోకూడదని నిశ్చయించుకొన్నాడట. కందిరీగలాంటి ఫక్తు కమర్షియల్ సినిమాలు చేసుకొంటూ సేఫ్ గేమ్ ఆడేద్దాం అని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కథ గొప్పగా లేకపోయినా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే చాలు.. అని చెబుతున్నాడట.
ఇప్పుడు గోపీచంద్ మలినేని కథకు ఓకే చేయడానికి కారణం కూడా అదేనట. ఈ సినిమాతో పాటు మరో సినిమాకి ఒకేసారి పట్టాలెక్కించాలని రామ్ ప్లాన్! రెండో కథ కూడా మాస్ రొటీన్ కమర్షియల్ ఫార్ములాలో సాగే సినిమానేనట. దర్శకుడు మాత్రం ఇంకా కన్‌ఫామ్ కాలేదు. రొటీన్ దారిలో అయినా రామ్‌ని విజయాలు పలకరిస్తాయో లేదో మరి.