బ‌సంతిలో బ్రహ్మీ డ‌బ్బులు పెట్టాడా?

బ‌సంతి విష‌యంలో బ్రహ్మానందం తీసుకొంటున్న కేర్ చూస్తుంటే అంద‌రికీ ముచ్చటేస్తోంది. చిరంజీవి, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్, ప్ర‌భాస్, రాజ‌మౌళి…. వీళ్లంద‌రితో పాట‌లు, ప్రచార చిత్రాలు విడుద‌ల చేయించాడు బ్రహ్మీ. ఆడియో కార్యక్రమానికి…

బ‌సంతి విష‌యంలో బ్రహ్మానందం తీసుకొంటున్న కేర్ చూస్తుంటే అంద‌రికీ ముచ్చటేస్తోంది. చిరంజీవి, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్, ప్ర‌భాస్, రాజ‌మౌళి…. వీళ్లంద‌రితో పాట‌లు, ప్రచార చిత్రాలు విడుద‌ల చేయించాడు బ్రహ్మీ. ఆడియో కార్యక్రమానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని తీసుకొచ్చి, ఈ సినిమా గురించి అంద‌రూ మాట్లాడుకొనేలా చేశాడు. ఓ తండ్రిగా తాను ఏం చేయ‌గ‌ల‌డో అన్నీ చేస్తున్నాడు. 

అయితే.. తెర వెనుక ఈ సినిమాకి డ‌బ్బులు పెట్టిన నిర్మాత కూడా బ్రహ్మానంద‌మే అని టాలీవుడ్‌టాక్‌. ఈ సినిమాకి ద‌ర్శకుడు చైత‌న్య దంతులూరి నిర్మాత కూడా. అయితే.. సింహ‌భాగం స‌ర్దింది మాత్రం బ్రహ్మానంద‌మే. సినిమా మొద‌లైన‌ప్పుడు పైసా ఇవ్వక‌పోయినా – సినిమా న‌డుస్తున్న విధానం చూసి, సినిమాపై న‌మ్మకం పెరిగి… పెట్టుబ‌డి స‌ర్దాడ‌ని, అందుకే ఇప్పుడు ఇంత హంగామా చేస్తున్నాడ‌ని చెప్పుకొంటున్నారు. 

బ్రహ్మానందం డ‌బ్బుల ద‌గ్గర మ‌హా పిసినారి అని ఈ సినిమాకి పైసా పెట్టుబ‌డి పెట్టే ఛాన్సే లేద‌ని బ్రహ్మీ గురించి బాగా తెలిసిన ద‌గ్గరి మ‌నుషులు చెబుతున్నారు. ఇందులో ఏది నిజ‌మో ఇక్కడి బ్రహ్మీకీ, అక్కడ బ్రహ్మకీ తెలియాలంతే.