వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఓ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకొంది రకూల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు మరో సినిమాని తన ఖాతాలో వేసుకొంది. త్వరలో ఆమె మంచు మనోజ్సినిమాలో నటిస్తున్నట్టు సమాచారమ్. మనోజ్ – జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది.
ఇందులో కథానాయికగా రకూల్ని ఎంచుకొన్నట్టు సమాచారమ్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తారు. వెంకటాద్రి తరవాత రకూల్కి మంచి ఆఫర్లే అందాయట. కానీ… రకూల్ ఏరి కోరి ఈసినిమానే ఎంచుకొందట.
దానికి కారణం… ఈ కథలో కథానాయిక పాత్రకీ ప్రాధాన్యం ఉండడమేనట. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయిందని టాక్. కానీ ఆ వివరాలేం బయటకు చెప్పడం లేదు.