సెకండ్ వీక్‌.. మ‌హా వీక్‌

ఈవారం బాక్సాఫీసు ద‌గ్గర సంద‌డేం క‌నిపించ‌లేదు. మూడు సినిమాలొచ్చినా ఒక్కటీ ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకోలేక‌పోయింది. గ‌త‌వారం హార్ట్ ఎటాక్ సినిమాకే అన్నో ఇన్నో వ‌సూళ్లున్నాయి. అవి కూడా అంతంత మాత్రమే. తొలివారం తొమ్మిది కోట్టు…

ఈవారం బాక్సాఫీసు ద‌గ్గర సంద‌డేం క‌నిపించ‌లేదు. మూడు సినిమాలొచ్చినా ఒక్కటీ ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకోలేక‌పోయింది. గ‌త‌వారం హార్ట్ ఎటాక్ సినిమాకే అన్నో ఇన్నో వ‌సూళ్లున్నాయి. అవి కూడా అంతంత మాత్రమే. తొలివారం తొమ్మిది కోట్టు కొల్లగొట్టిన హార్ట్ ఎట‌క్‌…. రెండో వీక్ మ‌హా వీక్ అయ్యింది. 50 శాతం కూడా ఆక్యుపెన్సీ లేవ‌ట‌. 

ఓవ‌ర్సీస్‌లో అయితే హార్ట్ ఎటాక్ సినిమాని క‌నీస వ‌సూళ్లు కూడా ద‌క్కలేదు. అక్కడ పూరి జ‌గ‌న్నాథ్ సినిమాకి మంచి డిమాండ్‌. పైగా నితిన్ క్రేజ్ ఉన్న హీరో. అయినా స‌రే…. హార్ట్ ఎటాక్‌ని అక్కడి ప్రేక్షకులు తిర‌స్కరించారు. ఈ సినిమాకి తొలి వారంలో రూ.50 ల‌క్షలు మాత్రమే వ‌చ్చాయ‌ట‌. ఇది పూరి సినిమాల్లో అతి త‌క్కువ వ‌సూళ్లు. అయితే పూరి ఈ సినిమాని తెలివిగా విడుద‌ల‌కు ముందే అమ్ముకోగ‌లిగాడు. ​