ఎన్టీఆర్ సినిమా ఈయేడాది లేన‌ట్టే

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేష‌న్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు ప‌రిశ్రమ వ‌ర్గాలూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ కాంబినేష‌న్ లో ఓ సినిమా రావ‌డం ఖాయ‌మే. కానీ ఇప్పుడు కాదు. ఈ సినిమా…

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేష‌న్ కోసం అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు ప‌రిశ్రమ వ‌ర్గాలూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ కాంబినేష‌న్ లో ఓ సినిమా రావ‌డం ఖాయ‌మే. కానీ ఇప్పుడు కాదు. ఈ సినిమా ఈ యేడాది లేన‌ట్టే అని తేల్చేస్తున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. 2014లో బ‌న్నీతో ఓ సినిమా చేస్తాడు త్రివిక్రమ్. 

ఒక‌వేళ ఈ సినిమా ముందుగా అయిపోయినా. 2014లో మ‌రో సినిమా త్రివిక్రమ్ చేసే అవ‌కాశం లేద‌ట‌. అందుకే ఎన్టీఆర్ సినిమా 2015లోనే అని స‌మాచార‌మ్‌. మ‌రోవైపు త్రివిక్రమ్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పెద్ద లంకే ప‌డింది. వీరిద్దరి హ్యాట్రిక్ చిత్రం కోబ‌లి. 

అయితే ఈ క‌థ‌పై విస్ర్కృత స్థాయిలో రిసెర్చ్ చేయాలట‌. ఒక‌వేళ ప‌వ‌న్ అడిగితే – బ‌న్నీ సినిమా త‌ర‌వాత ఈ రిసెర్చ్ వ‌ర్క్ పై ప‌డే అవ‌కాశాలున్నాయి. సో… ఎన్టీఆర్ -మాటల మాంత్రికుడి క‌ల‌యిక చూడాలంటే మ‌రో యేడాది ఆగాలి.