బాలీవుడ్‌లో సినిమా నిర్మాణం కొత్త, చెత్త పుంతలు తొక్కుతోంది. బూతు కంటెంట్ వుంటే చాలు సినిమాలు ఆడేస్తాయని ప్రత్యేకంగా కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. వారి పుణ్యమా అని బూతు సినిమాలు యధేచ్చగా బాలీవుడ్ తెరను తాకేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి కూడా డబ్ అయిపోతున్నాయి చాలా బూతు సినిమాలు.
అలా, బూతు సినిమాలకు ఆయా భాషల్లో లభిస్తోన్న స్పందనతో, ప్రత్యేకంగా బూతు సినిమాలు రూపొందించేవారు ఎక్కువైపోతున్నారు. సినిమాల్లో బూతు కోసం, విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేసే తారలు కావాలి కదా, అందుకే పోర్న్ రంగం నుంచీ తారల్ని ఎంపిక చేసేసుకుంటున్నారు. అలా బాలీవుడ్‌కి ఇంపోర్ట్ అయిన పోర్న్‌స్టార్ సన్నీలియోన్‌ని బాగానే వాడుకుంటున్నారు బాలీవుడ్‌లో.
తాజాగా ‘రాగిణి ఎంఎంఎస్`2’ సినిమా ట్రెయిలర్‌లో సన్నీలియోన్ న్యూడ్‌గా కన్పించడంతో అంతా షాక్ తినాల్సి వచ్చింది. ఈ సినిమా పోస్టర్లు సైతం అత్యంత జుగుప్సాకరంగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా సెన్సార్‌ని దాటుతుందా.? అన్న అనుమానాలు ఓ పక్క వ్యక్తమవుతోంటే, ‘మేనేజ్ చేసెయ్యొచ్చులే’ అన్న ధీమా నిర్మాతల్లో కన్పిస్తోంది.
సన్నీలియోన్‌కి బాలీవుడ్‌లో డిమాండ్ పెరగడం, ఆమె సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తుండడంతో.. పోర్న్ రంగం నుంచి మరికొందరు తారల్ని బాలీవుడ్‌లోకి దించేందుకు, సోకాల్డ్ బూతు సినిమాల దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఏం ట్రెండ్ బాసూ.. అన్పిస్తోంది కదూ. ఇదే మరి, చెత్త బూతు ట్రెండ్ అంటే.