శివ‌తో పోలుస్తారా?

ఎట్టకేల‌కు ఆటోన‌గ‌ర్ సూర్యకు మోక్షం ల‌భించింది. వాయిదాల మీద వాయిదాలు ప‌డినా ఈ సినిమాకి అంతో కొంత క్రేజ్ ఉంది. ట్రైల‌ర్‌, దేవాక‌ట్టాపై ఉన్న న‌మ్మకం ఈ ఆటోన‌గ‌ర్‌కి కాస్త హైప్ తీసుకొచ్చాయి. అయితే…

ఎట్టకేల‌కు ఆటోన‌గ‌ర్ సూర్యకు మోక్షం ల‌భించింది. వాయిదాల మీద వాయిదాలు ప‌డినా ఈ సినిమాకి అంతో కొంత క్రేజ్ ఉంది. ట్రైల‌ర్‌, దేవాక‌ట్టాపై ఉన్న న‌మ్మకం ఈ ఆటోన‌గ‌ర్‌కి కాస్త హైప్ తీసుకొచ్చాయి. అయితే చిత్రబృందం మాత్రం ఈ సినిమాని శివ‌తో పోల‌స్తూ మొద‌టికే మోసం తీసుకొచ్చే ప్రమాదం కొని తెచ్చుకొంటున్నారు. 

ఆటోన‌గ‌ర్ సూర్య ఆడియో రిలీజ్ కార్యక్రమం కాస్త శివ – ఆటోన‌గ‌ర్ సూర్యల మ‌ధ్య పోలిక పెట్టే ప్రహ‌స‌నంలా మారిపోయింది. వేదిక పై ఎవ‌రు ఎక్కినా పోస్టర్‌లో నాగ‌చైత‌న్ను చూస్తే శివ సినిమా గుర్తొస్తోంది అని చెప్పేవారే. కార్యక్రమానికి వ్యాఖ్యాత‌గా వ్యవ‌హ‌రించిన ఝూన్సీ సైతం ఆ ముక్క వంద‌సార్లు చెప్పింది, జ‌నాల చేత‌, అతిథుల చేత చెప్పించింది. 

రానా అయితే ఈ సినిమా త‌ర‌వాత శివ‌ని మ‌ర్చిపోతారు – అంటూ ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ పోలిక‌లు ఆటోన‌గ‌ర్ సూర్యకి ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. శివ‌ని ఏ సినిమాతోనూ పోల్చలేం. పోలిస్తే అంత‌కంటే పెద్ద త‌ప్పు మ‌రోటి లేదు. జోష్ సినిమాని కూడా అప్పుడు అలాగే శివ‌తో పోల్చారు. దానికి భారీ మూల్యం చెల్లించుకోవ‌ల‌సి వ‌చ్చింది. 

ఇప్పటికైనా ఆటోన‌గ‌ర్ సూర్యని ఆటోన‌గ‌ర్ సూర్యలా చూస్తే బెట‌ర్‌. అంచ‌నాలు ఎక్కువ అయినా ఏ సినిమా నిల‌దొక్కుకోలేదు. ఈ వాస్తవం చిత్ర బృందం గుర్తించుకొంటే మంచిది.