ఆ ఒక్కటీ అడ‌క్కు – 2

పిసికావులే పేడ – అంటూ అటుకుల చిట్టిబాబుగా రాజేంద్ర ప్రసాద్ ఓ రేంజులో న‌వ్వించాడు.. ఆ ఒక్కటీ అడ‌క్కు సినిమాలో. రాజేంద్ర ప్రసాద్ అల్లరి, రంభ అందాలు, రావుగోపాల‌రావు మేన‌రిజం – ఇవ‌న్నీ ఆ…

పిసికావులే పేడ – అంటూ అటుకుల చిట్టిబాబుగా రాజేంద్ర ప్రసాద్ ఓ రేంజులో న‌వ్వించాడు.. ఆ ఒక్కటీ అడ‌క్కు సినిమాలో. రాజేంద్ర ప్రసాద్ అల్లరి, రంభ అందాలు, రావుగోపాల‌రావు మేన‌రిజం – ఇవ‌న్నీ ఆ సినిమాని సూపర్ హిట్ చేశాయి. టీవీలో వ‌స్తే ఇప్పటికీ ప‌డీ ప‌డీ న‌వ్వుతూనే ఉంటాం. 

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వ‌స్తోందా?? ఆ సంగ‌తి తెలీదు గానీ, ద‌ర్శకుడు శివ‌నాగేశ్వర‌రావు మాత్రం త‌న సినిమాకి ఇలాంటి టైటిలే పెట్టాడు. ఆ ఒక్కటీ అడిగేయ్ అని!  శివ నాగేశ్వర‌రావు నూత‌న తారాగ‌ణంతో ఓ చిత్రాన్ని రూపొందించే ప‌నిలో ఉన్నాడు. 

దీనికి ఆ ఒక్కటీ అడిగేయ్ అనే పేరు ఖ‌రారు చేశారు. మ‌రి ఇది ఆ ఒక్కటీ అడ‌క్కు సినిమాకి సీక్వెలా?  కాదా??  అనేది ఆయ‌నకే తెలియాలి. త్వర‌లోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది.