మణిరత్నంతో మహేష్?

మొత్తానికి మరో రిస్క్ చేయడానికి మహేష్ డిసైడ్ అయిపోయనట్లే వుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో  నటించాలని మహేష్ కు చాలా కాలం కోరిక. ఇప్పడు అది నెరవేరబోతోందని తెలిసింది. పొన్నియన్ సెల్వన్ అనే…

మొత్తానికి మరో రిస్క్ చేయడానికి మహేష్ డిసైడ్ అయిపోయనట్లే వుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో  నటించాలని మహేష్ కు చాలా కాలం కోరిక. ఇప్పడు అది నెరవేరబోతోందని తెలిసింది. పొన్నియన్ సెల్వన్ అనే తమిళ నవల లైన్ మహేష్ కు వినిపించినట్లు, ప్రాధమికంగా ఓకె అనుకున్నట్లు తెలిసింది. 

నిజానికి ఇప్పడు, మహేష్ ఈ దశలో మణిరత్నంతో సినిమా అంటే రిస్క్ చేయడమే. ఎందుకంటే మణిరత్నం పెద్ద దర్శకుడే కావచ్చు. ఫామ్ లో మాత్రం లేడు. పైగా ఆయన సినిమాలు ఇప్పటి జనానికి నచ్చే రేంజ్ లో వుండడం లేదు. మరి అలాంటపుడు మహేష్ కు ఈ ప్రయోగం అవసరమా?​