మ‌హేష్ ధైర్యాన్ని మెచ్చుకోవల్సిందే!

`మ‌ళ్లీ క‌లిసి మ‌నం సినిమా చేద్దాం. సిద్ధంగా ఉండండి` అంటూ మ‌హేష్ ఫోన్ చేశాడ‌ని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఆ మాట విన్న ఇండస్ట్రీ వ‌ర్గాలు మ‌హేష్ ధైర్యాన్ని మెచ్చుకోవ‌ల్సిందే అంటున్నాయి. `1` సినిమాకి నెగిటివ్…

`మ‌ళ్లీ క‌లిసి మ‌నం సినిమా చేద్దాం. సిద్ధంగా ఉండండి` అంటూ మ‌హేష్ ఫోన్ చేశాడ‌ని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఆ మాట విన్న ఇండస్ట్రీ వ‌ర్గాలు మ‌హేష్ ధైర్యాన్ని మెచ్చుకోవ‌ల్సిందే అంటున్నాయి. `1` సినిమాకి నెగిటివ్ టాక్ వ‌చ్చినా, మెజారిటీ ప్రేక్షకుల‌కు అర్థం కాకుండా సినిమాని తీశాడ‌ని సుకుమార్‌పై నింద‌లు వేసినా… మ‌హేష్ మాత్రం అవేవీ ప‌ట్టించుకోకుండా ఆయ‌న‌తో  సినిమా చేయ‌డానికి సిద్ధం కావ‌డం ప‌ట్ల అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. 

నిజానికి ఇప్పటికిప్పుడే సుకుమార్‌తో మ‌హేష్ సినిమా చేయ‌క‌పోయినా… భ‌విష్యత్తులో మాత్రం త‌ప్పకుండా సినిమా చేస్తాడ‌ని అంటున్నారు.  ఎవ‌రికెలా అనిపించినా.. సినిమా మాత్రం మ‌హేష్‌కి బాగా న‌చ్చింద‌ట‌. త‌న‌ని కొత్త కోణంలో చూపించాడ‌ని ఆయ‌న సంతృప్తిగా ఉన్నార‌ట‌. పైపెచ్చు ఆయ‌న ఇటీవ‌ల రొటీన్ ఫార్ములా ప్రకార‌మే అడుగులేస్తున్నాడు. 

అందుకు భిన్నంగా ఈ సినిమాని తీసుకెళ్లడంతో.. రాబోయే సినిమాల‌కి మేలు జ‌రుగుతుంద‌ని మ‌హేష్ భావిస్తున్నార‌ట‌. ఈ సినిమాకి మాత్రం భారీగా న‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. ఎవ‌డు సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డం ఈసినిమాకి మ‌రింత మైన‌స్‌గా మారే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.