మహేష్‌తో ఓ సుక్కు ప్రేమ‌క‌థ‌

ఆర్య సినిమాతో ప్రేమ‌క‌థ‌ల్లో ఓ ప్రత్యేక‌మైన ట్రెండ్ సృష్టించాడు సుకుమార్‌. 100 % ల‌వ్ లోనూ స‌రికొత్త ల‌వ్ స్టోరీ ఆవిష్కరించాడు. ప్రేమ క‌థ‌ల్లో సుకుమార్ సూప‌ర్‌…. అని ఈ రెండు సినిమాలు చూసిన‌వాళ్లు…

ఆర్య సినిమాతో ప్రేమ‌క‌థ‌ల్లో ఓ ప్రత్యేక‌మైన ట్రెండ్ సృష్టించాడు సుకుమార్‌. 100 % ల‌వ్ లోనూ స‌రికొత్త ల‌వ్ స్టోరీ ఆవిష్కరించాడు. ప్రేమ క‌థ‌ల్లో సుకుమార్ సూప‌ర్‌…. అని ఈ రెండు సినిమాలు చూసిన‌వాళ్లు చెబుతారు. వ‌న్‌కి మాత్రం థ్రిల్లర్ త‌ర‌హా క‌థాంశాన్ని ఎంచుకొన్నాడు సుకుమార్‌. 

ఆ త‌ర‌వాత మ‌హేష్ తో సినిమా చేస్తే.. క‌చ్చితంగా ల‌వ్ స్టోరీనే తీస్తానంటున్నాడు. ''మ‌హేష్‌తో  ఓ ల‌వ్ స్టోరీ చేయాల‌నిపిస్తోంది. ఎందుకంటే.. అత‌న్ని అలాంటి క‌థ‌ల్లో మ‌రింత క్యూట్‌గా చూపించొచ్చు'' అన్నది సుకుమార్ మాట‌.  ప్రేమ‌క‌థ సంగ‌తి ప‌క్కన పెడితే, సుకుమార్‌కి మ‌హేష్‌తో మ‌రోసారి చేయాల‌నే కోరికైతే బ‌లంగానే ఉంది. 

అయితే ఈ కాంబినేష‌న్ రెండో సారి చూడాలంటే అది వ‌న్ ఫ‌లితంమీదే ఆధార‌ప‌డి ఉంటుంది. సుకుమార్ స్టైల్‌కి ఆల్రెడీ ప‌డిపోయిన మ‌హేష్‌, ఈ సినిమా హిట్టయితే రెండోసారి జ‌త క‌ట్టడానికి కాద‌న‌డు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.