ఒక్క హిట్టుకే కొందరికి కళ్లు నెత్తినెక్కుతున్నాయ్. ఆ హిట్టేదో అయ్యాగారి వల్లే వచ్చిందని బిల్డప్ లొకటి. ఆ హిట్టు చూసుకొని పారితోషికం అమాంతం పెంచేస్తున్నారు. డిమాండ్లు, షరతులు విధిస్తున్నారు. ఇప్పుడు కృష్ఱ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు పరిస్థితి కూడా అంతే.
ప్రేమకథా చిత్రమ్ తరవాత సుధీర్ బాబుకీ కాస్తో కూస్తో మార్కెట్ పెరిగింది. దాంతో ఛోటా, మోటా నిర్మాతలు సుధీర్ బాబు చుట్టూ తిరిగారు. అయితే మనోడు మాత్రం… కొత్త షరతులు విధిస్తున్నాడట. నాకు నైజాం రైట్స్ రాసిస్తారా, సినిమాలో వాటా ఇస్తారా? శాటిలైట్ రేట్స్ నాపేరు మీదే ఉండాలి… లాంటి మాటలు మాట్లాడుతున్నాడట.
దాంతో నిర్మాతలు ఖంగుతింటున్నారు. ఇటీవల ఓ బడా నిర్మాత సుధీర్ బాబుని సంప్రదిస్తే సినిమాలో వాటా అడిగాడట. దాంతో.. ఆయన మరో హీరోని వెదుక్కొన్నాడు. ఆడు మగాడ్రా బుజ్జీ ఫ్లాప్ అయిన తరవాత కూడా సుధీర్ బాబు తగ్గడం లేదట. ఇలాగైతే సుధీర్ కెరీర్ కష్టమే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. మరి సుధీర్‌కి ఈ సంగతి ఎప్పుడు అర్థమవుతుందో…?