నందినికీ నితిన్ కావాల‌ట‌!

ఇప్పుడు ద‌ర్శకులంద‌రి టార్గెట్ నితిన్‌. వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టాడు క‌దా, పైగా ఎలాంటి స్టోరీకైనా సెట్ అయిపోతాడు. నితిన్‌తో సినిమా అంటే నిర్మాత‌నీ వెదుక్కొనే ప‌ని త‌ప్పుతుంది. అందుకే… ఇప్పుడు న‌వ ద‌ర్శకులు,…

ఇప్పుడు ద‌ర్శకులంద‌రి టార్గెట్ నితిన్‌. వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టాడు క‌దా, పైగా ఎలాంటి స్టోరీకైనా సెట్ అయిపోతాడు. నితిన్‌తో సినిమా అంటే నిర్మాత‌నీ వెదుక్కొనే ప‌ని త‌ప్పుతుంది. అందుకే… ఇప్పుడు న‌వ ద‌ర్శకులు, హిట్టు కోసం ప‌రిత‌పిస్తున్న ద‌ర్శకులు, ఆల్రెడీ హిట్టిచ్చిన‌వాళ్లూ అంద‌రూ నితిన్ గుమ్మం ముందే త‌చ్చాడుతున్నారు. నందిని రెడ్డీకీ నితినే కావాల‌ట‌. 

అలా మొద‌లైంది సినిమాతో అంద‌రినీ త‌న వైపుకు తిప్పుకొంది నందినిరెడ్డి. అయితే జ‌బ‌ర్ ద‌స్త్ మాత్రం ఆమెపై చాలా దారుణ‌మైన ప్రభావం చూపించింది. ఆ సినిమా మామూలుగా ఫ్లాప్ అయితే ఎవ‌రూ ప‌ట్టించుకోక పోదును. బ్యాండ్ బాజా బారాత్ ని దొంగ‌చాటుగా కాపీ కొట్టి… అప‌వాదు నెత్తిన పెట్టుకొని తిర‌గాల్సివ‌స్తోంది. 

దాంతో నందినికి అవ‌కాశాలు క‌ర‌వ‌య్యాయి. చేతికి అంద‌ని ఛాన్సులు కూడా జారుకొన్నాయి. ఇప్పుడామె దృష్టి నితిన్‌పై ప‌డింది. ఈ హిట్ల హీరోకి క‌థ చెప్పి, ఓకే చేయించుకోవాలని త‌హ‌త‌హ‌లాడుతోంది. అందుకోసం మంచి క‌థ‌లూ రెడీ చేసుకొంటోంద‌ట‌. మ‌రి ఇప్పుడున్న బిజీలో నితిన్ నందినిరెడ్డికి మాటివ్వగ‌ల‌డా??  లేదా??  అనేదే తేలాల్సివుంది.