సత్యం నిందితులకి జైలు శిక్ష

సత్యం కంప్యూటర్స్‌ అనుబంధ సంస్థలు ఆదాయపు పన్నును ఎగవేశాయంటూ నమోదైన కేసులో ఆయా సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. సత్యం కంప్యూటర్స్‌కి సంబంధించి 19 అనుబంధ…

సత్యం కంప్యూటర్స్‌ అనుబంధ సంస్థలు ఆదాయపు పన్నును ఎగవేశాయంటూ నమోదైన కేసులో ఆయా సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. సత్యం కంప్యూటర్స్‌కి సంబంధించి 19 అనుబంధ సంస్థలకు చెందిన 84 మంది డైరెక్టర్లు ఈ జైలు శిక్షను అనుభవించాల్సి వుంటుంది.

శిక్ష పడ్డవారిలో సత్యం రామలింగరాజు భార్య నందిని, కుమారుడు రామరాజు, రామలింగరాజు సోదరుడి భార్య రాధ సహా పలువురు వున్నారు. మహిళా నిందితులకు ఆరు నెలల శిక్ష విధించిన న్యాయస్థానం, మిగతావారికి ఏడాది జైలు శిక్ష విధించింది.

రాష్ట్ర చరిత్రలోనే కాక, దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్‌ కుంభకోణంగా సత్యం కుంభకోణం వార్తల్లోకెక్కిన విషయం విదితమే. ప్రపంచ ఐటీ రంగంలో సత్యం సంస్థను అగ్రగామిగా నిలిపిన సత్యం రామలింగరాజు అనూహ్యంగా సత్యం సంస్థ మాటున కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొన్నారు.

ఈ కేసులో ఇదివరకే సత్యం రామలింగరాజుకి జైలు శిక్ష పడింది.