కరుగుతున్న ఓ కాలమా
నాలుగు దినములు వెనక్కి వెళ్ళుమా
ఉదయించనని అలిగి వెళుతున్న కిరణం
కాళ్ళ వెళ్ళా పడి ఆపుతాను
పనికిరాని వాళ్ళకు
పరమ బేవార్సు గాళ్ళకంటే మా ఉదయుడు
ఎందులో తక్కువ అని సినీ లోకాన్ని
నిలదీయాలని వుంది
జీవితమంటే సినిమా కాదని
చిత్ర సీమంటే చీమ తలకంటే చిన్నదే అని
విశాల లోక పరిదిని చూపి
గుండె గుండెని అల్ట్రా స్కాన్ చేసి
ఆ గుండెల్లో నువ్వు కొలువున్నావని
ఐ మాక్స్ లో చూపించాలని వుంది
ప్రతి హృదయ మానస వీణ ఎలా
విషాద గీతం పలికిస్తుందో
సంగీత కచేరీ చేసి చూపిస్తాను
కన్నతనంకే కళంకం తెచ్చిన
కఠిన పాషాణ కన్న కొడుకువై
ఉదయించే నీ ఉసస్సును
ఓర్వలేని జనుల కోసం
ఎందుకు ప్రసరించావు
నీ ఉసస్సు కోసం నిరీక్షించే
జనులును వదిలి మరలిరాని లోకానికి
ఎందుకు వెళుతున్నావని నిలదీస్తాను
కాలమా ఒక్కసారి కనికరం చూపుమా
మీగడ త్రినాధ రావు