‘అత్తారింటికి..’ చూసిన పెద్ద అక్కినేని!

అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తుతం అస్వస్థతతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, ‘అంతా సవ్యంగానే ఉన్నదని.. అస్వస్థత అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనని’ ఆయన మనుమడు…

అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తుతం అస్వస్థతతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, ‘అంతా సవ్యంగానే ఉన్నదని.. అస్వస్థత అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనని’ ఆయన మనుమడు హీరో సుమంత్‌ స్వయంగా ట్వీట్‌ కూడా చేసి అభిమానుల టెన్షన్‌ తగ్గించడానికి ప్రయత్నించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. అభిజ్ఞవర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆయన ఇబ్బందికరమేమీ కాకపోయినప్పటికీ ఆయన అస్వస్థతతో ఉన్న మాట మాత్రం నిజమేనని అంటున్నారు. 

మంగళవారం సాయంత్రం వరకు ఆయన చాలా ఉత్సాహంగానే ఉన్నారని.. మధ్యాహ్నం తరువాత ‘అత్తారింటికి దారేది’ చిత్రం కూడా వీక్షించారని కొందరి ద్వారా తెలిసింది. 

అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసినంత పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అక్కినేని అభిమానుల్లో ఆయన గురించి వస్తున్న వార్తలు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. సుమంత్‌ ట్వీట్‌ మినహా.. కుటుంబసభ్యులు ఎవరూ అధికారికంగా ఏమీ పేర్కొనకపోవడం, అభిమానుల ఆందోళన తగ్గించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.