సినీ నటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తనవద్ద మేనేజర్‌గా పనిచేసిన మున్నా అనే వ్యక్తికి ఉదయ్‌కిరణ్, తెలిసినవారివద్ద 17 లక్షలు అప్పు ఇప్పించాడనీ, పది రూపాయల వడ్డీకి మున్నా అప్పును పొందాడనీ, అప్పు తీర్చకుండా మున్నా గాయబ్ అయిపోవడంతో, అదంతా ఉదయ్‌కిరణ్ నెత్తిన పడిందనీ, అప్పు ఇచ్చినవారు ఉదయ్‌కిరణ్ వెంటపడ్డంతో అవమానం భరించలేక ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకుని వుంటాడనే అనుమానాలు బలపడ్తున్నాయి.
వాస్తవానికి సినీ పరిశ్రమలో ఈ తరహా వడ్డీ వ్యాపారాలు చాలా ఎక్కువే. పది రూపాయలేం ఖర్మ, నూటికి 16 రూపాయల వడ్డీ.. అంతకన్నా ఎక్కువ వసూలు చేసే వారూ వున్నారంటున్నారు సినీ పరిశ్రమలో అప్పుల బాధ పడ్డవారు. అవసరానికి డబ్బు దొరకడమే ముఖ్యం, వడ్డీ సంగతి తర్వాత.. అనే ఆలోచనతోనే చాలామంది వడ్డీ మాఫియా గుప్పిట్లో చిక్కుకుపోతుంటారు.
ఆ మాటకొస్తే, ఇలా వడ్డీ వ్యాపారాలు చేసేవారే ఒక్కోసారి నిర్మాతలుగానూ మారుతుంటారు. ఫైనాన్స్ ముసుగులో సినీ పరిశ్రమను ఇలా నాశనం చేసేవారి గురించి బయటకు మాట్లాడాలంటే సినీ ప్రముఖులకీ దడ. అంతలా ఫైనాన్స్ మాఫియా సినీ పరిశ్రమను శాసిస్తోందనే ఆరోపణలున్నాయి.
అన్నట్టు, ఉదయ్‌కిరణ్ మాజీ మేనేజర్ మున్నా ఓ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నాడట. ఆ వివరాల్ని బయటకు లాగే పనిలో బిజీగా వున్నారు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య కేసును విచారిస్తోన్న పోలీసులు.