అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమాను డ్యామినేట్ చేసిన కేజీఎఫ్ 2!

మూడో శుక్ర‌వారం కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ పై కేజీఎఫ్ 2 డ్యామినేష‌న్ కొన‌సాగుతూ ఉంది. కేజీఎఫ్ 2 ధాటికి భ‌య‌ప‌డి ఆ సినిమాతో పాటు విడుద‌ల‌కు బాలీవుడ్ సినిమాలు వెనుకంజ వేశాయి. ఒక వారం…

మూడో శుక్ర‌వారం కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ పై కేజీఎఫ్ 2 డ్యామినేష‌న్ కొన‌సాగుతూ ఉంది. కేజీఎఫ్ 2 ధాటికి భ‌య‌ప‌డి ఆ సినిమాతో పాటు విడుద‌ల‌కు బాలీవుడ్ సినిమాలు వెనుకంజ వేశాయి. ఒక వారం అంతా కేజీఎఫ్ 2 కే వ‌దిలేశాయి. అయితే కేజీఎఫ్ విడుద‌ల అయిన త‌రువాతి శుక్ర‌వారం, ఆ త‌ర్వాతి శుక్ర‌వారం సినిమాల‌పై కూడా ఈ క‌న్న‌డ మూలం పై చేయి సాధిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

బాలీవుడ్  కు సంబంధించి ఈ శుక్ర‌వారం అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన ర‌న్ వే 34, హీరో ప‌త్నీ 2 వంటి చెప్పుకోద‌గిన సినిమాలు విడుద‌ల అయ్యాయి. అయితే అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమా విడుద‌లైన తొలి రోజున మూడు కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే సాధించింది. ఇదే స‌మ‌యంలో కేజీఎఫ్ 2 నాలుగు కోట్ల రూపాయ‌ల‌ను సాధించుకుంది.

ఇలా బాలీవుడ్ సినిమాల‌ను మూడో వారంలో కూడా కేజీఎఫ్ 2 డ్యామినేట్ చేస్తోంది. ఇక మ‌రో బాలీవుడ్ సినిమా హీరోప‌త్నీ 2 మాత్రం కాస్త ఎక్కువ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఆ సినిమాకు తొలి రోజున  ఆరున్న‌ర కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించుకుంది.

స్థూలంగా కేజీఎఫ్ 2 ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు వంద‌ల యాభై కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. నాలుగు వంద‌ల కోట్ల‌రూపాయ‌ల వ‌సూళ్ల దిశ‌గా సాగుతూ ఉంద‌ని బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తూ ఉన్నాయి.