మిర్చి భామ‌కు గంట‌కు తొమ్మిది ల‌క్షలు!

డిసెంబ‌రు 31 సంబ‌రాల‌కు స‌ర్వం సిద్ధమ‌వుతోంది. యేడాదిలో చివ‌రి రాత్రి ఘ‌నంగా జ‌రుపుకోవ‌డానికి అంత ఉత్సాహం చూపిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలైతే క‌థానాయిక‌ల కోసం వెట మొద‌లెట్టేశాయి. క‌థానాయిక‌ల‌తో ఆడి పాడించి… కొత్త యేడాదిని ఘ‌నంగా…

డిసెంబ‌రు 31 సంబ‌రాల‌కు స‌ర్వం సిద్ధమ‌వుతోంది. యేడాదిలో చివ‌రి రాత్రి ఘ‌నంగా జ‌రుపుకోవ‌డానికి అంత ఉత్సాహం చూపిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలైతే క‌థానాయిక‌ల కోసం వెట మొద‌లెట్టేశాయి. క‌థానాయిక‌ల‌తో ఆడి పాడించి… కొత్త యేడాదిని ఘ‌నంగా స్వాగ‌తం ప‌ల‌కాల‌నుకొంటున్నాయి. 

అందుకే… క‌థానాయిక‌ల‌కు, ఐటెమ్ భామ‌ల‌కు విప‌రీతంగా డిమాండ్ ఏర్పడింది. మిర్చి భామ హంసానందినికీ మంచి బేరం కుదిరింది. డిసెంబ‌రు 31న రాత్రి ఒక్క గంట ఆడిపాడేందుకు హంస రూ.9 లక్షలు డిమాండ్ చేసింద‌ట‌. నిర్వాహ‌కులు హంస అడిగిన మొత్తాన్ని ఇచ్చి.. బుక్ చేసుకొన్నారు కూడా. 

మిర్చి సినిమాలో ఓ పాట‌లోక‌నిపించ‌డానికి ఏకంగా నాలుగు రోజులు క‌ష్టప‌డింది హంస‌. అక్కడ ల‌క్ష రూపాయ‌లైనా ఇచ్చారో లేదో..?.  ఇక్కడ గంట‌కు ప‌ది ల‌క్షలు సంపాదించేస్తోంది. 31 రాత్రి ఎవ‌రి రేటైనా ఇంతే మ‌రి..!