వ‌న్ మైన‌స్ ఏమిటి..??

వ‌న్ సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చాక‌… ఈ సినిమా గురించి మ‌రింత ఎక్కువ‌గా మాట్టాడుకొంటున్నారు. మ‌హేష్ బాబు స్టైల్‌, దేవి పాట‌లు. సుక్కు కాన్సెప్ట్స్, పీట‌ర్…

వ‌న్ సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఆడియో బ‌య‌ట‌కు వ‌చ్చాక‌… ఈ సినిమా గురించి మ‌రింత ఎక్కువ‌గా మాట్టాడుకొంటున్నారు. మ‌హేష్ బాబు స్టైల్‌, దేవి పాట‌లు. సుక్కు కాన్సెప్ట్స్, పీట‌ర్ హెయిన్స్ పోరాట‌లూ ఇలా ఎన్ని ప్లస్సులో. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మైన‌స్‌.. క‌థానాయిక కృతి స‌న‌న్‌. 

మ‌హేష్ ప‌క్కన టాప్ క‌థానాయిక‌లు న‌టించ‌డానికి పోటీ ప‌డుతుంటే కొత్తమ్మాయిని ఎంచుకొంది చిత్రబృందం. అయితే వ‌న్ ఆడియోలో కృతిని నేరుగా చూసిన మ‌హేష్ ఫ్యాన్స్ నోరెళ్ల బెట్టారు. త‌మ క‌థానాయ‌కుడి అందం ప‌క్కన ఏమాత్రమైనా స‌రితూగుతుందా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కృతిది పొటో జెనిక్ ఫేస్ కాద‌నే విష‌యం అర్థమ‌వుతూనే ఉంది. మ‌రి కెమెరాలో ఎలా క‌నిపిస్తుందో అనే ఆందోళ‌న ఎక్కువ‌వుతోంది. ట్రైలర్ బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్ప ఈ అమ్మడిలోని టాలెంట్ అర్థం కాదు. సుకుమార్ మాత్రం కృతి ఎంపిక‌ను స‌మ‌ర్థిస్తున్నాడు. ఇంజ‌నీరింగ్‌లో 87% ప‌ర్సంటేజీ వ‌చ్చింద‌ని అందుకే ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎంచుకొన్నాన‌ని చెబుతున్నాడు. ఇదేం లాజిక్కో ఈ లెక్కల మాస్టారుకే అర్థం కావాలి.