మెగా ఫ్యాన్స్ స్పందన కరువైందా?

ఇవ్వాళ రేపు సోషల్ మీడియాదే హవా. హీరోలకు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు వుంటే అంత బలం. ఒక విధంగా ఇదో సైన్యం. తమ హీరోకి మద్దతుగా సోషల్ మీడియాలో పోరాడే సైన్యం. మహేష్…

ఇవ్వాళ రేపు సోషల్ మీడియాదే హవా. హీరోలకు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు వుంటే అంత బలం. ఒక విధంగా ఇదో సైన్యం. తమ హీరోకి మద్దతుగా సోషల్ మీడియాలో పోరాడే సైన్యం. మహేష్ బాబు, బన్నీ, పవన్ కళ్యాణ్, లాంటి వాళ్లకు ఇలాంటి సైన్యం బలంగా వుంది. ప్రభాస్ కు కొంత వరకు ఓకె. బాలయ్య, ఎన్టీఆర్ లాంటి వాళ్లకు ఇటు స్వంత సైన్యం, అటు తెదేపా సైన్యం అండగా వుంటుంది. రామ్ చరణ్-చిరు విషయంలో ఫాలోవర్లు గట్టిగా వున్నా పోరాటం తక్కువగా వుంది.

ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు రామ్ చరణ్ ఈ విషయం గమనించిన తన సోషల్ మీడియా సైన్యాన్ని కొంత బలోపేతం చేసే ప్రయత్నం చేసారు. అంటే ఇలాంటి పనులు చూసేవారికి అప్పగిస్తే, వాళ్లు వందలాది అక్కౌంట్లు ఓపెన్ చేయడం, తమ క్లయింట్ కు మద్దతుగా డిఫెండ్ చేయడం వంటివి చేస్తారు అన్నమాట. పొలిటికల్ పార్టీలు కూడా ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటాయి.

దాంతో ఆర్ఆర్ఆర్ టైమ్ లో రామ్ చరణ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో గట్టి పని సాగింది. ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ వార్ అన్నట్లుగా సోషల్ మీడియా లో సందడి నెలకొంది. కానీ ఆచార్య వరకు వచ్చేసరికి ఈ పోరాటం కనిపించలేదు. సినిమా విడుదల రోజు తెల్లవారు ఝాము నుంచి యాంటీ మెగా ఫ్యాన్స్ దే పై చేయిగా వుంది. తొలి రోజు, మలి రోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.

ఆఖరికి బుక్ మై షో లో కూడా ఈ ట్రెండ్ క్లియర్ గా కనిపించింది. బుక్ మై షో లో రేటింగ్ అన్నది ట్రెండ్ అన్నది పెద్దగా పూల్ ఫ్రూఫ్ అని చెప్పడానికి లేదు. బుక్ మై షో కి కూడా ప్రకటనలు ఇవ్వడం, రేటింగ్ క్లిక్ లు ఏర్పాటు చేయడం వంటి వ్యవహారాలు వున్నాయి. వాటికోసమే పని చేసే జ‌నాలు కూడా వున్నారు.

బుక్ మై షోలో ప్రస్తుతం ఆచార్య ఇంట్రస్ట్ 60 శాతం మేరకు వుంది. అదే కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ చూస్తే 90శాతం దాటేసాయి. ఓట్లు అంటే దేశవ్యాప్తంగా కనుక ఎక్కువ తక్కువ వుండొచ్చు. కానీ చూడాలన్న ఆసక్తి కూడా ఇంత తేడాగా వుండడం ఏమిటి? ఫ్యాన్స్ అంతా దాదాపు గా ఆన్ లైన్ లో నే టికెట్ లు కొడతారు. అది కూడా ముందుగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు క్లిక్ చేస్తే 60 శాతం దాటిపోవాలి కదా?

ఇదిలా వుంటే ఆదివారం నాడు హైదరాబాద్ చాలా చోట్ల కెజిఎఫ్ 2 ఫుల్స్ కు దగ్గరగా వున్నాయి. కానీ ప్రసాద్ లో ఆదివారం ఆచార్య ఎనిమిది షో లు పెడితే ఒక్కటే ఫుల్ అయింది. జంటనగరాల్లో మెగా ఫ్యాన్స్ లక్షల్లో వుంటారు. కెేవలం వారు చూసినా మంచి కలెక్షన్లు నమోదు అవుతాయి. తొలి రోజు ఓపెనింగ్ షో లే చాలా చోట్ల ఫుల్ కాలేదు అంటే మెగా ఫ్యాన్స్ ఏమయినట్లు అన్న అనుమానాలు వస్తున్నాయి.

మెగా ఫాన్స్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, బన్నీ, చరణ్ ఫ్యాన్స్ గా విడిపోయారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అందువల్లే ఈ పరిస్థితి అన్న వాదన వినిపిస్తోంది. అందరూ కలిస్తే మెగా ఫ్యాన్స్ మరింత మెగా అవుతున్నారన్నది వాస్తవం.