నందమూరి బాలకృష్ణకి ‘సంక్రాంతి హీరో’ అనే బిరుదు ఉందనేది తెలిసిన విషయమే. సంక్రాంతికి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహాలాంటి సూపర్‌హిట్స్ అందించిన బాలకృష్ణ ఆ తర్వాత సంక్రాంతి సీజన్లో మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టలేదు. అయినా కానీ సెంటిమెంట్ ప్రకారం బాలయ్య సినిమా సంక్రాంతికే వస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతారు.
కానీ బాలకృష్ణ తాజా చిత్రం ‘లెజెండ్’ సంక్రాంతికి రావడం లేదు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేలా ప్రణాళిక వేసుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే తొందర కూడా పడడం లేదు. ఫిబ్రవరిలో సినిమాలు సరిగా ఆడవనే భ్రమని ‘మిర్చి’ చిత్రం పోగొట్టింది. ఫిబ్రవరి 8న విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన ‘మిర్చి’తో ఏ టైమ్‌లో వచ్చినా సినిమాలు ఆడతాయనేది స్పష్టమైంది.
అందుకే ఓవర్ క్రౌడెడ్‌గా కనిపిస్తున్న సంక్రాంతి సీజన్‌ని విడిచి ‘మిర్చి’ వచ్చినట్టు ఫిబ్రవరి రెండవ వారంలో ‘లెజెండ్’ కూడా రాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై బిజినెస్ సర్కిల్స్‌కి కూడా విపరీతంగా అంచనాలున్నట్టున్నాయి. అన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన రేట్లకి లెజెండ్‌ని కొంటున్నారు.