ఎన్టీఆర్‌ నెక్స్‌ట్‌ అదేనట

ప్రస్తుతం ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ‘జోరు’ చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్‌ దీని తర్వాత ఏం సినిమా చేస్తాడనే సస్పెన్స్‌ దాదాపు వీడిపోయినట్టే అని న్యూస్‌. ఎన్టీఆర్‌ నెక్స్‌ట్‌ సినిమా వినాయక్‌ డైరెక్షన్‌లో…

ప్రస్తుతం ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ‘జోరు’ చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్‌ దీని తర్వాత ఏం సినిమా చేస్తాడనే సస్పెన్స్‌ దాదాపు వీడిపోయినట్టే అని న్యూస్‌. ఎన్టీఆర్‌ నెక్స్‌ట్‌ సినిమా వినాయక్‌ డైరెక్షన్‌లో ఉంటుందని తెలిసింది. రీసెంట్‌గా ఎన్టీఆర్‌ని కలిసి అవుట్‌ లైన్‌ కూడా చెప్పాడట. కొత్త దర్శకులతో పని చేసే కంటే కొంతకాలం అనుభవజ్ఞులతోనే చేద్దామని ఎన్టీఆర్‌ డిసైడ్‌ అయ్యాడు. 

అందుకే పూరి జగన్నాథ్‌కి కూడా కాల్‌ చేసి తనకోసం కథ సిద్ధం చేయమని ఎన్టీఆర్‌ చెప్పాడు. పూరి ప్రస్తుతం హార్ట్‌ ఎటాక్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే అతను ఎన్టీఆర్‌ కోసం సబ్జెక్ట్‌ రెడీ చేస్తాడు. కానీ ముందుగా వినాయక్‌ సినిమా మొదలు కానుందని అంటున్నారు. 

ఎన్టీఆర్‌తో ఆది, అదుర్స్‌లాంటి హిట్స్‌ ఇచ్చిన వినాయక్‌ మరోసారి మాస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిక్స్‌ చేసి కమర్షియల్‌ కథని ఎన్టీఆర్‌ కోసం రెడీ చేయిస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఒక సినిమా చేస్తున్న వినాయక్‌ అది పూర్తి కాగానే ఎన్టీఆర్‌ సినిమా మొదలు పెడతాడు. ఎన్టీఆర్‌, వినాయక్‌ ఇద్దరూ కూడా దాదాపు ఒకే టైమ్‌కి ఫ్రీ అవుతారు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేస్తున్నట్టే.