పవన్‌కళ్యాణ్‌ పిచ్చ కాన్ఫిడెంట్‌

పవన్‌కళ్యాణ్‌ హవా ఇప్పుడు మునుపెన్నడూ లేనంత బలంగా వీస్తోంది. 2012, 13 సంవత్సరాలకి టాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇంకా సెట్స్‌ మీదకి వెళ్లకుండానే ‘గబ్బర్‌సింగ్‌ 2’…

పవన్‌కళ్యాణ్‌ హవా ఇప్పుడు మునుపెన్నడూ లేనంత బలంగా వీస్తోంది. 2012, 13 సంవత్సరాలకి టాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇంకా సెట్స్‌ మీదకి వెళ్లకుండానే ‘గబ్బర్‌సింగ్‌ 2’ చిత్రాన్ని హాట్‌ కేక్‌లా చెప్పిన రేటుకి కొనేసుకుంటున్నారు. ‘గబ్బర్‌సింగ్‌’ సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయనేది పవన్‌కి బాగా తెలుసు. 

ఏమాత్రం తేడా జరిగినా కానీ సీక్వెల్‌కి టాక్‌ వీక్‌గా వచ్చే ప్రమాదముంది. అందుకే పవన్‌ స్వయంగా ఈ చిత్రం స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. పవన్‌ క్లోజ్‌ సోర్సెస్‌ చెబుతున్నదానిని బట్టి ‘గబ్బర్‌సింగ్‌ 2’ స్క్రిప్ట్‌ పవన్‌కి చాలా బాగా నచ్చిందట. తాను అనుకున్న దానికంటే స్క్రిప్ట్‌ బాగా వచ్చిందని పవన్‌ అంటున్నాడట. 

అనుకున్నది అనుకున్నట్టుగా తెరమీదకి తీసుకెళితే మాత్రం ‘గబ్బర్‌సింగ్‌ 2’ డిజప్పాయింట్‌ చేయదని పవన్‌ నమ్ముతున్నాడట. సంపత్‌ నంది ఈ చిత్ర కథని మలిచిన తీరు పట్ల పవన్‌ సంతృప్తిగా ఉన్నాడట. ఈ సినిమాకి సంపత్‌ నంది డైరెక్టరేంటని కొందరు కామెంట్‌ చేస్తున్నా పవన్‌ మాత్రం అతని విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట.