నట సింహం బాలయ్య ఇప్పుడు సీరియస్ మూడ్‌లో ఉన్నాడు. వరుసగా ఫ్లాపులు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేస్తున్నాడేమో…? సెట్లో కూడా అదే సీరియస్ లుక్‌ని, మూడ్‌ని కొనసాగిస్తున్నాడు. ఒక్కరు క్రమశిక్షణ ఉల్లంఘించినా తెగ సీరియస్ అయిపోతున్నాడట.
లెజెండ్ గురించిన న్యూస్ మీడియాకు లీకైపోతోంది ఎందుకని బోయపాటి, సాయికొర్రపాటికి కంబైన్డ్ గా క్లాసు పీకాడట బాలకృష్ణ. సెట్లో వెకిలిగా ఎవరు ప్రవర్తించినా, తన ముందు ఓవరాక్షన్ చేసినా ఉపేక్షించడం లేదట. ఆఖరికి బ్రహ్మానందానికీ క్లాసు పీకాడట. ఓ రోజు సెట్‌కి ఆలస్యంగా వచ్చాడని, బ్రహ్మీపై చిరుబురులాడిపోయాడు బాలకృష్ణ.
కథానాయికల దగ్గరా ఫైర్ అయిపోతున్నాడట. బాలయ్యని ఇంత బీపీలో ఎప్పుడూ చూడలేదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలయ్య అంటే అంతే మరి. క్రమశిక్షణకు మారు పేరు. పైగా సీరియస్ మూడ్ లో ఉన్నాడు. సింహం ముందు తింగరి వేషాలేస్తానంటే కుదురుతుందా??