సెన్సార్‌ అవసరం లేదట

ఇండో కెనడియన్‌ పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌, బాలీవుడ్‌లో ‘జాక్‌పాట్‌’ అనే సినిమాలో నటించిన విషయం విదితమే. తెలుగులో ‘ఒరేయ్‌ పండు’ తదితర సినిమాల్లో నటించిన సచిన్‌ జోషి ఈ సినిమాలో హీరో. విడుదలకు సిద్ధమైన ఈ…

ఇండో కెనడియన్‌ పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌, బాలీవుడ్‌లో ‘జాక్‌పాట్‌’ అనే సినిమాలో నటించిన విషయం విదితమే. తెలుగులో ‘ఒరేయ్‌ పండు’ తదితర సినిమాల్లో నటించిన సచిన్‌ జోషి ఈ సినిమాలో హీరో. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిందట.

పోర్న్‌స్టార్‌ని తీసుకొచ్చి, ఫ్యామిలీ సినిమా ఎవరు తీస్తారు చెప్పండి.? ఆమె బాలీవుడ్‌లో నటించిన గత చిత్రాలు ఏ రేంజ్‌లో హాట్‌ హాట్‌గా యూత్‌ని కిర్రెక్కించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జాక్‌పాట్‌’లోనూ గ్లామర్‌ డోస్‌ ఒకింత ఎక్కువే వుందని టీజర్‌ని బట్టి స్పష్టమవుతోంది.

సన్నీలియోన్‌ మాత్రం, సెన్సార్‌ చేయాల్సిన అవసరమే లేదంటోంది. సెన్సార్‌ చేసిన సినిమాల్లోనే నానా రకాల బూతు కంటెంట్‌ వచ్చేస్తోన్న రోజులివి. సెన్సార్‌ చేయకుండా వదిలేస్తే.. ఇంకేమన్నా వుందా.? అని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.