మంచు బ్రదర్‌గా మోహన్‌బాబు?

మంచు వారి ఫ్యామిలీ ఓ మల్టీస్టారర్‌ సినిమాలో సందడి చేయబోతోంది. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు కలసి నటిస్తున్నారంటే విష్ణు, మనోజ్‌లకు మోహన్‌బాబు తండ్రిగా నటిస్తారేమో అనుకొంటాం. కానీ ఈసినిమాలో మాత్రం మనోజ్‌, విష్ణులకు అన్నయ్యలా…

మంచు వారి ఫ్యామిలీ ఓ మల్టీస్టారర్‌ సినిమాలో సందడి చేయబోతోంది. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు కలసి నటిస్తున్నారంటే విష్ణు, మనోజ్‌లకు మోహన్‌బాబు తండ్రిగా నటిస్తారేమో అనుకొంటాం. కానీ ఈసినిమాలో మాత్రం మనోజ్‌, విష్ణులకు అన్నయ్యలా కనిపించబోతున్నారట.

ఇది అయిదుగురు అన్నదమ్ముల కథ అట. అంటే పంచపాండవులన్నమాట. మిగతా ఇద్దరు అన్నదమ్ములుగా వరుణ్ సందేశ్ , తనీష్‌ లు నటిస్తున్నారు. ఈ వయసులో కూడా, తన తనయులకు తండ్రిలా కాకుండా, అన్నయ్యలా నటించడానికే ఇష్టపడుతున్నాడంటే.. మోహన్‌బాబులో ఎంత తాపత్రయముందో అర్థమవుతోంది.

శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే 50 శాతం చిత్రణ పూర్తయిందట.